మన ‘తాజ్‌మహల్’లో మెరిసిన అందమే.. నుస్రత్ బరూచా
ఇటీవల విడుదలైన ‘రామ్‌సేతు’లో ప్రొఫెసర్ గాయత్రి పాత్రలో తెరపై కనిపించింది నుస్రత్ బరూచా.
Image:nushrrattbharuccha
శివాజీ హీరోగా తెరకెక్కిన తాజ్‌మహల్ సినిమాలో తెలుగు తెరపై మెరిసింది ఈ నటి.
Image:nushrrattbharuccha
‘లవ్ కే సెక్స్ ధోకా’, ‘ప్యార్ కా పంచనామా’, ‘ప్యార్ కా పంచనామా 2’, ‘సోను కె టిటు కి స్వీటీ’ వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Image:nushrrattbharuccha
1985 మే 17న ముంబయిలో నుస్రత్ బరూచా జన్మించింది. అక్కడే జైహింద్ కాలేజీలో ఫైన్ ఆర్ట్స్‌లో పట్టా సంపాదించింది.
Image:nushrrattbharuccha
కెరీర్ తొలినాళ్లలో టెలివిజన్ సిరీస్ కిట్టీపార్టీలో చిన్న పాత్రలో నటించింది. ఈ తరువాత కొన్నాళ్లకు ‘జిందగీ కహీన్ గుమ్ హై’ మ్యూజిక్ వీడియోలో నటించి మెప్పించింది.
Image:nushrrattbharuccha
అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. ప్యార్ కా పంచనామా 2తో ఆమె కెరీర్ మరింత ఊపందుకుంది.
Image:nushrrattbharuccha
నుస్రత్ కేవలం హిందీలోనే కాదు.. తెలుగు, తమిళ భాషా చిత్రాల్లోనూ నటించింది.
Image:nushrrattbharuccha
న్యూమరాలజీని బాగా నమ్మే ఈ ముద్దుగుమ్మ 2020లో ఇంగ్లిషులో తన పేరు స్పెల్లింగ్ మార్చుకుంది.
Image:nushrrattbharuccha
2021లో విడుదలైన ‘చోరీ ’చిత్రంలో నుస్రత్ నటనకు అవార్డులు క్యూకట్టాయని చెప్పొచ్చు. ఇప్పుడు ‘చోరీ 2’లో నటిస్తోంది.
Image:nushrrattbharuccha
గోల్డ్ అవార్డ్స్-ఉత్తమ నటి, లోక్‌మత్ స్టైలిష్ అవార్డ్స్-అత్యుత్తమ స్టైల్ పర్ఫామెన్స్, ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఈస్ట్-మోస్ట్ మెమోరబుల్ పర్ఫామెన్స్ అవార్డులు ఆమెను వరించాయి.
Image:nushrrattbharuccha
ప్రస్తుతం ఈమెకు ఇన్‌స్టాలో 5.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అందులో తన గ్లామర్ చిత్రాలతోపాటు.. సినీ విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
Image:nushrrattbharuccha
‘జన్ హిత్ మే జారీ’ సినిమాలో కండోమ్‌లు విక్రయించే యువతి పాత్రలో నటించి ఔరా అనిపించింది.
Image:nushrrattbharuccha
హిందీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఛత్రపతి’లోనూ ఈ తార నటిస్తున్నట్లు సమాచారం.
Image:nushrrattbharuccha
ఈ సుందరి తాజా చిత్రం ‘సెల్ఫీ’ ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Image:nushrrattbharuccha