కాంటాక్ట్ లెన్సులతో జాగ్రత్త .. ఎవరీ జాస్మిన్!
కాంటాక్టు లెన్సుల గురించి తాజాగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దానికి కారణం జాస్మిన్ భాసిన్. బాలీవుడ్ టీవీ నటి అయిన ఈమె ఏం చెప్పింది, అసలు ఎవరీమె?
‘కాంటాక్టు లెన్సులు ఉపయోగించడం వల్ల కళ్లు దెబ్బతిన్నాయి. కార్నియా డ్యామేజ్ అవ్వడంతో కళ్లు సరిగా కనిపించడం లేదు. సరిగా నిద్ర పోలేకపోతున్నా’ అని జాస్మిన్ అంటోంది.
This browser does not support the video element.
కాంటాక్ట్ లెన్స్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలంటున్న జాస్మిన్.. రాజస్థాన్‌లో పుట్టి పెరిగింది. 2011లో మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టింది.
‘వాణమ్’ అనే తమిళ చిత్రంలో 2011లో అతిథి పాత్రలో నటించింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో ‘దిల్లున్నోడు’, ‘వేట’, ‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్’ చిత్రాల్లో నటించింది.
‘కరోడ్ పతి’, ‘బివేర్ ఆఫ్ డాగ్స్’, ‘జిల్ జంగ్ జక్’, ‘హనీమూన్’, ‘వార్నింగ్ 2’ వంటి తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ మెరిసింది.
బుల్లితెరపై 2015లో ‘తషాన్ ఎ ఇష్క్’ అనే సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఇది దాదాపు రెండేళ్లు నడిచింది.
This browser does not support the video element.
ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే సీరియల్స్ ద్వారా అభిమానుల్ని పెంచుకుంది జాస్మిన్. బాలీవుడ్ బిగ్‌బాస్ 14లోనూ పాల్గొంది.
‘ఖత్రోం కీ ఖిలాడి’ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇందులో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది.
ప్రస్తుతం పంజాబ్‌లో ‘క్యారీ అన్ జట్టియే’, ‘అర్‌దాస్ సర్‌బత్ దే భాలే ది’ వంటి చిత్రాల్లో నటిస్తోంది.
మ్యాగజైన్ కవర్ ఫొటోలకు పోజులిస్తుంటుంది. ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంటుంది. ఈమె ఇన్‌స్టా ఖాతా ఫాలోవర్ల సంఖ్య 85లక్షలకు పైమాటే.
This browser does not support the video element.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ ఫొటోషూట్లు వీడియోలతో ఇన్‌స్టాలో కుర్రకారును హీటెక్కిస్తుంటుంది.