సెలబ్రిటీల పిల్లలూ.. తెరపై మెరుస్తున్నారు

సెలబ్రిటీల పిల్లలు కూడా తమదైన తీరులో తెరపై కనిపిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. వాళ్లెవరో తెలుసుకుందాం!

image:instagram/urstrulymahesh

అల్లు అర్హ..

ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కుమార్తె అల్లు అర్హ తెరపై కనిపించనుంది. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ తెరకెక్కిస్తోన్న ‘శాకుంతలం’లో అల్లు అర్హ నటించింది.

 image:instagram/allusnehareddy

This browser does not support the video element.

సితార..

 మహేశ్‌ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’లో ‘పెన్ని’ ప్రత్యేక పాటలో సితార స్టెప్పులేసింది.

image:instagram/sitaraghattamaneni

తేజస్విని..

‘మహానటి’లో చిన్ననాటి సావిత్రి పాత్రలో నటించి అందరి మన్ననలను పొందింది తేజస్విని. ఈ పాప నటుడు రాజేంద్ర ప్రసాద్‌ మనవరాలు.

image:Aditya Music

నైనికా..

‘తేరి’తో సినీరంగంలోకి అడుగుపెట్టింది మీనా గారాల పట్టి నైనికా. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్‌కి కుమార్తెగా నటించింది.

image:instagram/meenasagar16 

అరియానా, వివియానా..

మంచు విష్ణు నటించిన ‘జిన్నా’లో తన కుమార్తెలిద్దరూ అరియానా, వివియానా ‘ఇదే స్నేహం’ పాటతో అలరించారు. 

image:instagram/viranica

గౌతమ్‌..

మహేశ్‌ బాబు కుమారుడు ‘గౌతమ్‌’ కూడా తండ్రి నటించిన ‘1’లో నటించాడు. 

image:instagram/namratashirodkar 

శౌర్య రామ్‌..

నందమూరి కల్యాణ్‌ రామ్‌ కుమారుడు శౌర్య రామ్ తన తండ్రి నటించిన ‘ఇజం’లో చిన్ననాటి కల్యాణ్‌గా నటించాడు. 

image:facebook/Nandamuri Kalyanram 

సాత్విక్‌..

డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేని కుమారుడు సాత్విక్‌..‘క్రాక్‌’లో నటించాడు.

image:instagram/dongopichand 

రిద్ది.. ప్రభాస్‌తో అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా!

కృతి సనన్.. గ్లామర్‌ అదిరెన్‌..!

బిహారీ భామ.. ఐశ్వర్యా సుస్మిత

Eenadu.net Home