లోక్‌సభ ఎన్నికలు.. భాజపాలో సినీతారలు

వెండితెరపై మెరిసిన చాలా మంది సినీతారలు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో భాజపా తరఫున కొందరు నటీనటులు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. వారెవరో చూద్దామా...

కంగనా రనౌత్‌

బాలీవుడ్‌ క్వీన్‌గా గుర్తింపు పొందిన కంగనా.. ఈ మధ్యే భాజపాలో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆమె హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. 

నవ్‌నీత్‌ రాణా

ఒకప్పటి టాలీవుడ్‌ నటి నవ్‌నీత్‌ కౌర్‌ రాణా మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం స్వతంత్ర ఎంపీగా వ్యవహరిస్తున్నారు. మార్చిలో భాజపాలో చేరి ఆ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నారు. 

హేమమాలిని

భాజపాలో సీనియర్‌ నాయకురాలు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర నుంచి మూడోసారి ఎంపీగా పోటీకి దిగుతున్నారు. 2014, 2019లోనూ ఈమె ఆ స్థానం నుంచే పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు హ్యాట్రిక్‌కి ప్రయత్నిస్తున్నారు. 

స్మృతి ఇరానీ

బుల్లితెర నటిగా కెరీర్‌ ప్రారంభించి.. భాజపాలో కీలక నేతగా మారారు. రెండు పర్యాయాలు కేంద్రమంత్రిగా వ్యవహరించిన ఈమె.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథి నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారు.

సురేశ్‌ గోపీ

మాలీవుడ్‌ స్టార్‌ నటుడు సురేశ్‌ గోపీ చాలా కాలంగా భాజపాలో ఉన్నారు. 2019లో త్రిస్సూర్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ అదే స్థానంలో పోటీకి దిగుతున్నారు. 

రవి కిషన్‌

భోజ్‌పురి నటుడు, ‘రేసుగుర్రం’ ఫేమ్‌.. రవి కిషన్‌.. భాజపాలో కీలక నేత. 2019లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ సారి కూడా అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

రాధికా శరత్‌కుమార్‌

టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందిన రాధిక శరత్‌కుమార్‌.. ప్రస్తుతం భాజపా తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈమె తమిళనాడులోని విరుధునగర్‌ నుంచి బరిలోకి దిగుతున్నారు. 

అరుణ్‌ గోవిల్‌

రామాయణ్‌ సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అరుణ్‌ గోవిల్‌.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరాఠ్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ పడుతున్నారు.

సుమలత

కర్ణాటకలోని మండ్య నియోజకవర్గం స్వతంత్ర ఎంపీ, నటి సుమలత కూడా ఇటీవల భాజపాలో చేరారు. ఆ పార్టీ తరఫున సీటు కోరినా.. పొత్తులో భాగంగా అది జేడీఎస్‌ నేత కుమారస్వామికి దక్కింది. ఆయనకు మద్దతిస్తానని ప్రకటించారు. 

2025.. పాన్‌ ఇండియా ఇయర్‌!

కల్ట్‌ లవ్‌స్టోరీ సీక్వెల్‌లో నెరు నటి

కిస్సిక్‌తో క్రేజ్.. ఎవరీ ఊర్వశి అప్సర

Eenadu.net Home