అలాయా.. అందం అదిరింది
‘జవాని జానేమన్’తో బాలీవుడ్‌కు పరిచయమైన నటి అలాయా ఎఫ్. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.
Image:Instagram
ఇటీవల ఈ భామ యువ హీరో కార్తీక్ ఆర్యన్‌కి జంటగా ‘ఫ్రెడ్డీ’లో నటించింది.
Image:Instagram
శశాంక్ ఘోష్ దర్శకత్వంలో రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ఫ్రెడ్డీ’ డిసెంబర్ 2 నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Image:Instagram
This browser does not support the video element.
అలాయా ఎఫ్.. పూర్తి పేరు అలాయా ఇబ్రహీం ఫర్నీచర్‌వాలా. అలనాటి బాలీవుడ్ అందాల తార పూజా బేడీ కుమార్తె, నటుడు కబీర్ బేడీ మనవరాలే ఈ భామ.
Image:Instagram
ముంబయిలోని జమ్నాబాయి నర్సీ స్కూల్‌లో చదువుకుంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నటనలో డిప్లొమా పొందింది. తర్వాత తన పేరును అలాయా ఎఫ్‌గా మార్చుకుంది.
Image:Instagram
‘జవానీ జానేమన్’లో అలయా 21 ఏళ్ల గర్భిణిగా నటించింది. తండ్రిగా సైఫ్ అలీ ఖాన్, తల్లిగా టబు నటించారు.
Image:Instagram
ఈ సినిమాలో నటనకుగానూ ‘ఉత్తమ పరిచయ నాయిక’గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది అలాయా.
Image:Instagram
‘జవానీ జానేమన్’ విడుదలైన తర్వాత అలాయా నెపోటిజం విమర్శలను ఎదుర్కొంది. అయితే, తనపై వచ్చిన ఆ విమర్శలను తిప్పికొట్టింది. ప్రతిభ ఉంటేనే అవకాశాలుంటాయంది.
Image:Instagram
ఈ బ్యూటీ సినిమాల్లోకి రాకముందే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ని దక్కించుకుంది.
Image:Instagram
ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటోంది.
Image:Instagram
అలాయాకి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం ‘యూ టర్న్’లో నటిస్తోంది.
Image:Instagram
ఇండస్ట్రీలో ప్రియాంక చోప్రా, ఆలియా భట్, దీపికా పదుకొణె అంటే తనకు ఇష్టమని ఓ సందర్భంలో చెప్పింది.
Image:Instagram
శ్రీకాంత్ బొల్లా బయోపిక్‌లోనూ ఈ భామ నటిస్తోంది. ఇటీవల షూటింగ్‌లో పాల్గొన్న ఫొటోను పోస్టు చేసింది.
Image:Instagram