అప్సర రాణి.. ఈ ‘పాపతో పైలం’  

పలు తెలుగు చిత్రాల్లోని ప్రత్యేక గీతాల్లో సందడి చేస్తూ యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకుంటోంది.. హాట్‌ బ్యూటీ అప్సర రాణి.

Image:Instagram

తాజాగా ‘హంట్‌’తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

Image:Instagram

సుధీర్‌బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ‘హంట్‌’లో ‘పాపతో పైలం’ అంటూ సాగే ప్రత్యేక గీతంలో ఆడిపాడింది.

Image:Instagram

ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Image:Instagram

అప్సర రాణి.. జనవరి 12, 1996న డెహ్రాడూన్‌లో జన్మించింది. ఈమె అసలు పేరు అంకితా మహారాణా. బెల్గాంలోని జీఐటి కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది.

Image:Instagram

ఈమెకు చిన్నప్పట్నుంచే నటనంటే ఆసక్తి. నటి కావాలని స్కూల్‌డేస్‌లోనే డిసైడ్ అయ్యిందట.

Image:Instagram

‘4 లెటర్స్‌’తో తొలిసారి వెండితెరపై మెరిసిన ఈ బ్యూటీ.. ‘ఊల్లాలా ఊల్లాలా’, ‘థ్రిల్లర్‌’ తదితర చిత్రాల్లో నటించింది.

Image:Instagram 

‘క్రాక్‌’లో భూమ్‌ బద్దలు, ‘సీటీమార్‌’లో పెప్సీ ఆంటీ అనే ప్రత్యేక గీతాల్లో తన అందచందాలతో కుర్రకారును హుషారెక్కించింది.

Image:Instagram

ఇటీవల రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘మా ఇష్టం’ (హిందీలో డేంజరస్‌)లో నైనా గంగూలీతో కలిసి నటించింది.

Image:Instagram

టాలీవుడ్‌లో తన ఫేవరెట్‌ హీరో నాగార్జున అని ఓ సందర్భంలో వెల్లడించింది.

Image:Instagram 

ఈ భామకి దర్శకత్వంపై ఆసక్తి ఉందట. అవకాశం వస్తే భవిష్యత్తులో సినిమాలకు దర్శకత్వం వహిస్తానని ఓ ఇంటర్వ్యూలోకి చెప్పుకొచ్చింది.

Image:Instagram

అప్సరారాణి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్‌ని అభిమానులతో పంచుకుంటుంది.

Image:Instagram

లవ్లీ.. లెహంగాస్‌!

జాన్వీ.. చుట్టమల్లే చుట్టేస్తాందే!

దర్శకుల గురించి తారక్‌ సూపర్‌ మాటలు!

Eenadu.net Home