సొట్ట బుగ్గల సుందరి.. దివి

‘మహర్షి’తో తెలుగుతెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ దివి వైద్య.

Source:instagram/Divi

ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ 4’తో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించింది. పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది.

Source:instagram/Divi

దివి 1996 మార్చి 15న హైదరాబాద్‌లో మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది.

Source:instagram/Divi

ఎంబీఏ వరకు చదువుకున్న ఈ అందాల భామ 2017లో మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది.

Source:instagram/Divi


డైరెక్షన్, ప్రొడక్షన్‌, హీరోయిన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌.. ఇలా 24 క్రాఫ్ట్‌ల్లో ఏ విభాగంలోనైనా పని చేయడం దివికి ఇష్టమేనట.

Source:instagram/Divi

‘క్యాబ్‌ స్టోరీస్‌’తో ఓటీటీ వేదికగా సినీప్రియుల్ని పలకరించింది.

Source:instagram/Divi

ఇటీవల ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో విడుదలైన ‘పరంపర సీజన్‌ 2’లోనూ మెరిసింది.

Source:instagram/Divi

చిరంజీవి కథానాయకుడిగా మెహర్‌ రమేష్‌ తెరకెక్కిస్తున్న మాస్‌ యాక్షన్‌ చిత్రం ‘భోళా శంకర్‌’లో దివి ఓ పాత్రలో నటిస్తోంది.

Source:instagram/Divi

‘నటిగా నాకంటూ ఎలాంటి పరిమితులూ లేవు. మనసుకు నచ్చిన పాత్ర దొరికితే చాలు. చేసేది పెద్ద చిత్రమా.. చిన్న సినిమానా? అని అసలు పట్టించుకోను’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Source:instagram/Divi

‘సింబా - ది ఫారెస్ట్ మ్యాన్‌’ అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఈ చిత్రంలోని ప్రేమా గీమా.. అంటూ సాగే పాటని ఇటీవలే విడుదల చేశారు.

Source:instagram/Divi 

 ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌. ఎప్పటికప్పుడు తన ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది.ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 8 లక్షలకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు.

Source:instagram/Divi

నిమ్రత్‌ @ 8.. రూమర్స్‌తో ట్రెండింగ్‌లోకి!

ఇండియాలో టాప్‌- 10 ‘గూగుల్డ్‌’ షోస్‌

సెలెనా గోమెజ్‌... పెళ్లి వార్తతో వైరల్‌

Eenadu.net Home