అందమైన ‘మాన్‌స్టర్‌’ హనీ రోజ్‌

మాలీవుడ్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ నటించిన ‘మాన్‌స్టర్‌’ తాజాగా ఓటీటీలో విడుదలైంది. ఇందులో మలయాళీ బ్యూటీ హనీరోజ్‌ ప్రధాన పాత్రలో నటించింది.

Image:Instagram

థ్రిల్లర్‌ జానర్‌లో వచ్చిన ఈ చిత్రంలో కుటుంబ పోషణ కోసం ‘షీ-ట్యాక్సీ’ డ్రైవర్‌గా మారిన భామిని పాత్రలో నటించింది. 

Image:Instagram

బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందుతున్న ‘వీరసింహా రెడ్డి’ లోనూ ఈ భామ నటిస్తోంది.

Image:Instagram  

గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌ కాగా.. హనీ రోజ్‌ కీలక పాత్ర పోషిస్తోంది.

Image:Instagram  

గతంలోనే తెలుగు ప్రేక్షకుల్ని పలకరించి వెళ్లిన ఈ కేరళ అందం.. మరోసారి టాలీవుడ్‌లో మెరవనుంది.

Image:Instagram

హనీ రోజ్‌ వర్గీస్‌.. 1991 మే 9న ఇడుక్కి జిల్లా (కేరళ)లోని మూలమట్టంలో జన్మించింది.

Image:Instagram

కొచ్చికి సమీపంలోని అలువాలో సెయింట్ జేవియర్స్ మహిళా కళాశాలలో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్‌లో డిగ్రీ పూర్తి చేసింది.

Image:Instagram 

పద్నాలుగేళ్ల వయసులోనే మలయాళీ చిత్రం ‘బాయ్‌ ఫ్రెండ్‌(2005)’తో వెండితెరపై తళుక్కుమంది.

Image:Instagram

‘ముధల్ కనవే (2007)’తో కోలీవుడ్, ‘ఆలయం(2008)’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. వరుణ్‌ సందేశ్ హీరోగా వచ్చిన ‘ఈ వర్షం సాక్షిగా (2014)’లోనూ నటించింది. కన్నడలో ఓ చిత్రం చేసింది.

Image:Instagram

ఇతర చిత్రసీమల్లో ఆమెకు ఆశించినంత గుర్తింపు రాలేదు. దీంతో మాలీవుడ్‌కే పరిమితమైన హనీ.. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ తెలుగులో నటిస్తోంది.

Image:Instagram

ఈ భామ ఇప్పటివరకు మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సూమారు 30కి పైగా చిత్రాల్లో నటించింది.

Image:Instagram

ఎక్కువగా చీరకట్టులోనే కనిపించే ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌. ఇన్‌స్టాలో 1.4 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు.

Image:Instagram

పచ్చందనమే.. పచ్చదనమే

‘హిట్‌’ కొట్టేసిన మీనాక్షి చౌదరి!

పెళ్లి పీటలెక్కనున్న ‘అతియా శెట్టి’

Eenadu.net Home