నటనలోనే కాదు.. అందంలోనూ పరి ‘పూర్ణ’త!

ఈ మలయాళీ కుట్టి వివాహం యూఏఈకి చెందిన వ్యాపారవేత్త షనీద్ అసిఫ్ ఆలీతో దుబాయ్‌లో పెద్దల సమక్షంలో ఘనంగా జరిగింది.

Image:Instagram

తాజాగా మ్యారేజ్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది.

Image:Instagram 

పూర్ణ అసలు పేరు షమ్నా కాశిం. 1989 మే 23న కేరళలోని కానూర్‌లో జన్మించింది. క్లాసికల్‌ డ్యాన్సర్‌గా చేస్తూ 2004లో మలయాళ సినిమాల్లోకి అడుగుపెట్టింది.

Image:Instagram

ఈ ఏడాది ఆది సాయికుమార్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ జోడీగా వచ్చిన ‘తీస్‌మార్‌ఖాన్‌’లో పూర్ణ కీలక పాత్ర పోషించింది.

Image:Instagram

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపై పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. వెబ్‌ సిరీస్‌లతోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

Image:Instagram

తమిళంలో ‘నవరస’, ‘కన్నమూచి’, తెలుగులో ‘త్రీ రోజెస్‌’ వంటి వెబ్‌ సిరీస్‌ల్లోనూ కనిపించింది. ఆమె నటించిన ‘ఆనందం’ (తమిళం) వెబ్‌ సిరీస్‌ విడుదలకు సిద్ధంగా ఉంది.

Image:Instagram

ఈ కేరళ భామని ఇంట్లో ముద్దుగా ‘చిన్నాట్టి’ అని పిలుస్తారట. ఆ పేరుతోనే యూట్యూబ్‌ ఛానల్‌ని ప్రారంభించింది.

Image:Instagram  

పూర్ణకి చీకటన్నా, దొంగలన్నా చాలా భయం. ‘అవును’ షూటింగ్‌ పూర్తయిన తరువాత నెలరోజులు సరిగా నిద్రపోలేదట.

Image:Instagram   

ఇప్పటి వరకు తెలుగు, మలయాళం, తమిళం, కన్నడం భాషల్లో కలిపి 60కి పైగా చిత్రాల్లో నటించింది పూర్ణ.

Image:Instagram 

టాలీవుడ్‌ హీరోల్లో విజయ్‌ దేవరకొండ, ప్రభాస్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

Image:Instagram

ప్రస్తుతం ఈ భామ నటించిన నాలుగు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో రెండు చిత్రాల్లో నటిస్తోంది.

Image:Instagram  

దేవర వీక్‌.. ఈ బ్యూటీలదే!

లవ్లీ.. లెహంగాస్‌!

జాన్వీ.. చుట్టమల్లే చుట్టేస్తాందే!

Eenadu.net Home