అక్కడ ‘రీనా’.. ఇక్కడ ‘భావన’

‘కేజీయఫ్‌’తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి.. ‘కోబ్రా’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Image:Instagram/Srinidhi Shetty

కోలీవుడ్ స్టార్ విక్రమ్‌ హీరోగా అజయ్‌ జ్ఞానముత్తు తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కోబ్రా’. ఇందులో ఆమె విక్రమ్ సరసన నటించింది. ఈ చిత్రం ఇటీవల విడుదలైంది.

Image:Instagram/Srinidhi Shetty 

‘కేజీయఫ్‌’లో రీనాగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి.. ‘కోబ్రా’లో భావన మేనన్‌గా కనిపించింది.

Image:Instagram/Srinidhi Shetty

 ‘కోబ్రా’ కోసం రూ. 6 కోట్ల పారితోషికం తీసుకుందని ఇండస్ట్రీలో చెప్పుకొంటున్నారు.

Image:Instagram/Srinidhi Shetty 

శ్రీనిధి శెట్టి.. 1992, అక్టోబర్‌ 21న కర్ణాటకలోని కిన్నిగోలికి చెందిన తుళు కుటుంబంలో జన్మించింది.

Image:Instagram/Srinidhi Shetty

బెంగళూరులోని జైన్‌ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసిన శ్రీనిధి.. చదువుతోపాటు ఫ్యాషన్‌ రంగంపై కూడా ఆసక్తి చూపేది.

Image:Instagram/Srinidhi Shetty

ఓ ప్రముఖ కంపెనీలో తన చదువుకు తగ్గ ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు మోడలింగ్‌లోనూ తన ప్రతిభను చాటుకుంది.

Image:Instagram/Srinidhi Shetty 

పలు ఫ్యాషన్‌ షో పోటీల్లో పాల్గొన్న శ్రీనిధి.. ‘మిస్‌ కర్ణాటక 2015’, ‘మిస్‌ సుప్రనేషనల్‌ ఇండియా 2016’ ఇలా అనేక అవార్డులను గెలుచుకుంది. Image:Instagram/Srinidhi Shetty

మిస్‌ సుప్రనేషనల్‌ విజేతగా నిలిచిన శ్రీనిధికి సినీరంగం నుంచి అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలోనే కేజీయఫ్‌తో హీరోయిన్‌గా మారి పాపులర్‌ అయింది. Image:Instagram/Srinidhi Shetty

శ్రీనిధికి డ్యాన్స్‌ చేయడం, ట్రావెలింగ్ హాబీస్. రెడ్‌, ఎల్లో, బ్లాక్‌ కలర్ డ్రెస్సులను ధరించడం ఇష్టమట.

Image:Instagram/Srinidhi Shetty

సోషల్‌ మీడియాలో ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాలో 4.3 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు.

Image:Instagram/Srinidhi Shetty

ఈషా శారీ లుక్స్‌.. సోషల్‌ మీడియా షేక్స్‌..

వన్ ఉమెన్ బ్యాండ్.. జస్లిన్‌ రాయల్‌

సాహసాలు.. ఐస్‌క్రీమ్‌లు.. ఇవీ భాగ్యశ్రీ ఇష్టాలు

Eenadu.net Home