నిర్మాతలుగా.. హీరోయిన్లు

కంగనా రనౌత్‌

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ మణికర్ణిక ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ‘టీకూ వెడ్స్‌ షేరు’ అనే సినిమా నిర్మిస్తోంది. నిర్మాతగా ఇదే తన తొలి సినిమా. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, అవనీత్‌ కౌర్‌ కలిసి నటించిన ఈ చిత్రం జూన్‌23న ఓటీటీలో విడుదలకానుంది. 

Image: Instagram

కృతి సనన్‌

‘ఆదిపురుష్‌’లో జానకిగా నటించిన కృతి సనన్‌ కూడా నిర్మాత అవతారం ఎత్తనుంది. ఓటీటీ కోసం ఓ చిత్రం నిర్మించడానికి కృతి సిద్ధమైంది. ఇప్పటికే కథను ఓకే చేసినట్లు సినీ వర్గాల సమాచారం. 

Image: Instagram

ప్రియాంక చోప్రా

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంకకు ‘పర్పుల్‌ పబ్బుల్‌’ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ఉంది. తను నటించిన ‘ది స్కై ఈజ్‌ పింక్‌’తోపాటు మరో చిత్రం ‘ఫైర్‌బ్రాండ్‌’ను తనే నిర్మించింది. 

Image: Instagram

కరీనా కపూర్‌ ఖాన్‌

దర్శకుడు హన్సల్‌ మెహతా చెప్పిన కథ నచ్చడంతో కరీనా కపూర్ అందులో నటించడంతోపాటు నిర్మాతగానూ మారింది. క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Image: Instagram

అనుష్క శర్మ

నటి అనుష్క శర్మ.. 2013లోనే ‘క్లీన్‌ స్లేట్‌’ పేరుతో ప్రొడక్షన్‌ కంపెనీ ప్రారంభించింది. ‘బుల్‌బుల్‌’, ‘ఎన్‌హెచ్‌ 10’, ‘పరి’ చిత్రాలు, ‘పాతాళ్‌ లోక్‌’ వెబ్‌ సిరీస్‌ను నిర్మించింది.

Image: Instagram

దీపికా పదుకొణె

బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె కూడా నిర్మాతగా వ్యవహరించింది. ‘కేఏ ప్రొడక్షన్‌’ బ్యానర్‌పై తను నటించిన ‘చపాక్‌’ చిత్రాన్ని నిర్మించింది. ఆ తర్వాత ‘83’ సినిమా నిర్మాణంలో భాగమైంది.

Image: Instagram

ఆలియా భట్‌

ఆలియా భట్‌ కూడా ‘ఎటర్నల్‌ సన్‌షైన్‌ ప్రొడక్షన్‌ ’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. ఇటీవల విడుదలైన ‘డార్లింగ్స్‌’ సినిమాకు తనే నిర్మాతగా వ్యవహరించింది. 

Image: Instagram

రిచా చద్దా

మరో బాలీవుడ్‌ నటి రిచా చద్దా కూడా నిర్మాతగా మారింది. ‘పుషింగ్‌ బటన్‌ స్టూడియోస్‌’ పేరుతో నిర్మాణ సంస్థ నెలకొల్పి.. ‘గర్ల్స్‌ విల్‌ బి గర్ల్స్‌’ అనే సినిమాను నిర్మిస్తోంది. 

Image: Instagram

చార్మి

దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలిసి టాలీవుడ్‌ నటి చార్మి ‘పూరి కనెక్ట్స్‌’ నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ‘జ్యోతి లక్ష్మి’, ‘రోగ్‌’, ‘పైసా వసూల్‌’, ‘మెహబూబా’, ‘లైగర్‌’ తదితర చిత్రాలకు సహా నిర్మాతగా వ్యవహరించింది. 

Image: Instagram

నయనతార

తన భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి నయనతార ‘రౌడీ పిక్చర్స్‌’ పేరుతో ప్రొడక్షన్‌ కంపెనీ మొదలుపెట్టింది. ‘పబుల్స్‌’, ‘నెట్రికన్‌’, ‘కాతువాకుల రెండు కాదల్‌’ చిత్రాలు ఈ నిర్మాణ సంస్థ రూపొందించినవే.

Image: Instagram

తాప్సీ

టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసి.. బాలీవుడ్‌లో స్థిరపడ్డ తాప్సీ ‘ఔట్‌సైడర్స్‌ ఫిల్స్మ్‌’ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. తను నటించిన ‘బ్లర్‌’ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరించింది.

Image: Instagram

ఐశ్వర్య లక్ష్మి

మలయాళీ భామ.. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా కొనసాగుతూనే సినిమా నిర్మాణంలో అడుగుపెట్టింది. సాయి పల్లవి నటించిన ‘గార్గి’ చిత్ర నిర్మాణంలో ఐశ్వర్య భాగమైంది. 

Image: Instagram

వీళ్లతోపాటు మాధురి దీక్షిత్‌, దియా మీర్జా, ట్వింకిల్‌ ఖన్నా, చిత్రాంగద సింగ్‌, టిస్కా చోప్రా తదితర నటీమణులు కూడా నిర్మాతలుగా మారి సినిమా నిర్మాణంలో భాగమవుతున్నారు.

Image: Instagram

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home