సినిమా - రాజకీయం.. వివాహ బంధం!
రాజకీయాలకు, సినిమాలకు విడదీయరాని బంధముంది. కొందరు సినీతారలు వారి పాపులారిటితో రాజకీయ నాయకులుగా మారుతున్నారు. మరికొందరు తారలు రాజకీయ నాయకుల్ని వివాహం చేసుకుంటున్నారు. అలా పొలిటిషియన్స్ జీవితభాగస్వాములుగా మారిన హీరోయిన్లు ఎవరెవరున్నారో చూద్దామా...
Image: Instagram
పరిణీతి చోప్రా - రాఘవ్ చద్దా
Image: Instagram
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా గతకొంతకాలంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ప్రేమలో ఉందని వార్తలొచ్చాయి. వాటిని నిజం చేస్తూ తాజాగా వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు.
Image: Instagram
స్వర భాస్కర్ - ఫహద్ అహ్మద్
Image: Instagram
సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ నటి స్వర భాస్కర్ ఈ మధ్యే సమాజ్‌వాది పార్టీకి చెందిన యువ నేత ఫహద్ అహ్మద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
Image: Instagram
అయేషా టకియా - ఫర్హాన్ అజ్మీ
Image: Instagram
నాగార్జున ‘సూపర్’తో టాలీవుడ్‌కు పరిచయమైన నటి అయేషా టకియా.. 2009లో ఫర్హాన్ అజ్మీని వివాహామాడింది. ఫర్హాన్ కూడా సమాజ్‌వాది పార్టీ యువనేతనే.
Image: Instagram
నవనీత్ కౌర్ - రవి రాణా
Image: Instagram
టాలీవుడ్ హీరోయిన్ నవనీత్ కౌర్.. మహారాష్ట్రలోని అమరావతికి చెందిన రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే రవి రాణాను పెళ్లి చేసుకుంది. 2019లో ఎంపీగా ఎన్నికైంది.
Image: Instagram
రాధిక - కుమారస్వామి
Image: Instagram
కన్నడ నటి రాధిక తెలుగులో తారకరత్న ‘భద్రాద్రి రాముడు’లో నటించింది. ఈమె కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని వివాహం చేసుకుంది.
Image: Instagram