నింగిలో దూసుకెళ్తోన్న తారలు!

హీరోలతో సమానంగా హీరోయిన్లు కూడా సాహసాలు చేస్తున్నారు. యాక్షన్ సీన్స్‌లో ఆయుధాలు పట్టడమే కాదు.. పైలట్‌గా మారి విమానాలూ నడుపుతున్నారు. అలా ఇప్పటి వరకు పైలట్‌ పాత్ర పోషించిన హీరోయిన్లపై ఓ లుక్కేద్దామా... 

(Photos: Twitter)

దీపికా పదుకొణె

హృతిక్‌ రోషన్‌, దీపికా పదుకొణె కలిసి ‘ఫైటర్‌’లో నటిస్తున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో హృతిక్‌తోపాటు దీపిక కూడా వాయుసేన పైలట్‌గా కనిపించబోతోంది. జనవరి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. 

కంగనా రనౌత్‌

బాలీవుడ్‌ క్వీన్‌ కూడా తన కొత్త చిత్రంలో పైలట్‌ అవతారం ఎత్తింది. ‘తేజస్‌’లో ఈమె ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌గా సాహసాలు చేయనుంది. సర్వేశ్‌ మేవారా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అక్టోబర్‌ 20న విడుదలవుతోంది. 

జాన్వీ కపూర్‌

యుద్ధభూమిలో విమానం నడిపిన గుంజన్‌ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం.. ‘గుంజన్‌ సక్సేనా: ది గార్గిల్‌ గర్ల్‌’. ఇందులో జాన్వీ కపూర్‌ టైటిల్‌ రోల్‌ పోషించింది. 2020లో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ తెచ్చుకుంది.

రకుల్‌ప్రీత్‌

అజయ్‌ దేవగణ్‌, అమితాబ్‌బచ్చన్‌ కలిసి నటించిన ‘రన్‌వే 34’.. 2015లో జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కింది. ఇందులో అజయ్‌ దేవగణ్‌ పైలట్‌ కాగా.. కో-పైలట్‌గా రకుల్‌ప్రీత్‌ నటించింది. 

రవీనా టాండన్‌

టాలీవుడ్‌లో 22 ఏళ్ల కిందట విడుదలైన ‘ఆకాశవీధిలో’ చిత్రంలో హీరోహీరోయిన్‌ నాగార్జున, రవీనా టాండన్‌ ఇద్దరూ పైలట్‌గా నటించారు. హైజాక్‌ నేపథ్యంలో సాగే సినిమా ఇది.

పార్వతి తిరువోతు

మలయాళీ బ్యూటీ పార్వతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఉయరే’. పైలట్‌ ట్రైనింగ్‌ తీసుకునే అమ్మాయిగా, యాసిడ్‌ దాడి బాధితురాలిగా పార్వతి నటించింది. 2019లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. 

సమంత

‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ సీజన్‌ 2లో సమంత ప్రతినాయిక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ క్లైమాక్స్‌లో సమంత హెలికాప్టర్‌ నడిపిస్తుంది. అయితే, కథానాయకుడు మనోజ్‌ బాజ్‌పేయీ ఆ హెలికాప్టర్‌ను కూల్చేస్తాడు.

వర్ష నాయర్‌

సూర్య ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రం చివర్లో విజయగర్వంతో ఓ మహిళా పైలట్‌ కనిపిస్తుంది గమనించారా? తనే వర్ష నాయర్‌. చెన్నైకి చెందిన ఈమె నిజ జీవితంలోనూ పైలటే. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈమెను చూసి దర్శకురాలు సుధ కొంగర సినిమాలో ఎంపిక చేశారు. 

మానుషి చిల్లర్‌

వరుణ్‌తేజ్‌ తాజా చిత్రం ‘ఆపరేషన్‌ వాలంటైన్‌’. వాయుసేన నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో వరుణ్‌తేజ్‌తోపాటు మానుషి కూడా పైలట్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home