‘కల్కి..’ నాయికలు

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన చిత్రం ‘కల్కి 2898 ఎ.డి’. రూ. 600 కోట్లతో నిర్మించిన ఈ సినిమా తాజాగా విడుదలైంది. ఇందులో పలువురు నాయికలు ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగమయ్యారు. వారెవరో చూద్దాం..

దీపికా పదుకొణె

‘కల్కి’లో దీపిక.. సమ్‌-80 అనే పాత్రలో గర్భిణిగా కనిపించనుంది. సినీవర్గాల ప్రకారం.. సినిమాలో ఈమెపై పరిశోధనలు జరుగుతుంటాయట.

ఈ బ్యూటీకి ఇది తొలి తెలుగు చిత్రం. ‘‘కల్కి..’లో అగ్ర తారలతో తెరను పంచుకున్నందకు చాలా సంతోషంగా ఉంది’ అంటోంది దీపిక.

దిశా పటానీ

ఇందులో రాక్సీ పాత్రలో నటించింది. ఫైట్లు కూడా చేస్తుందట. ‘గ్లామర్‌ రోల్స్‌లోనే కాదు యాక్షన్‌ పాత్రలూ చేస్తాను’ అంటోందీ బ్యూటీ.

టాలీవుడ్‌లో ‘లోఫర్‌’తో తెరంగేట్రం చేసిన ఈ భామ.. బాలీవుడ్‌లో బిజీగా ఉంటోంది. మళ్లీ 9 ఏళ్ల తర్వాత తెలుగు తెరపై ‘కల్కి’తో ఆకట్టుకోనుంది.

అనా బెన్‌

ఈ చిత్రంలో అనా.. కైరా పాత్ర పోషించింది. ‘ద లక్కీ రెబల్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో చిత్రబృందం ఈమె పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్‌ కూడా విడుదల చేసింది. 

ఈ మలయాళీ నటికి తెలుగులో ఇదే తొలి చిత్రం. ‘‘కల్కి’లో నటించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా కెరీర్‌ను మలుపు తిప్పే సినిమా ఇది’ అంటోంది.

మృణాల్‌ ఠాకూర్

ఈ చిత్రంలో మృణాల్ కూడా ఓ అతిథి పాత్రను పోషించింది. దివ్య అనే రోల్‌లో గర్భిణిగా కనిపించింది.

శోభన

అలనాటి నటి శోభన ‘కల్కి’లో కీలక పాత్ర పోషించింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ సినిమాతోనే తెరపై రీఎంట్రీ ఇస్తోంది.

కీర్తి సురేష్‌

భైరవ కంపానియన్‌ బుజ్జి(వాహనం)కి కీర్తి వాయిస్‌ ఓవర్‌ అందించింది. బుజ్జికి ఈమె వాయిస్‌ బాగా సూట్‌ అయిందని అందరూ మెచ్చుకుంటున్నారు.

మాళవికా నాయర్‌

ఈమె ‘కల్కి’లో ఉత్తర అనే పాత్రలో కనిపించనుంది. ఇంతవరకూ మాళవిక లుక్‌కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ బయటపెట్టలేదు చిత్రబృందం. 

ఫరియా అబ్దుల్లా

‘కల్కి’లో ఈ బ్యూటీ కూడా ప్రత్యేక పాత్రలో ఓ మెరుపు మెరిసింది.

బ్యూటీల ఫిట్‌నెస్‌ మంత్ర

దక్షిణాది చిత్రసీమపై కన్నేసిన అనసూయ

గోల్డెన్‌ బ్యూటీ.. జాన్వీ

Eenadu.net Home