యోగాతోనే ఫిట్‌నెస్ అంటోన్న సినీభామలు
జాన్వీ కపూర్
జిమ్‌కి ఎంత సమయం కేటాయిస్తుందో.. యోగాకి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తుంది జాన్వీ కపూర్. ‘వేగంగా బరువు తగ్గాలన్నా, చక్కటి శరీరాకృతి సొంతం కావాలన్నా యోగా చేయడం తప్పనిసరి’ అంటోంది.
This browser does not support the video element.
అలియా భట్
రెగ్యులర్‌గా యోగా చేస్తోంది. ‘కండరాలు ఫ్లెక్సిబుల్‌గా మారడానికి యోగా చక్కని ఉపాయం. అలాగే బరువును అదుపులో ఉంచుతుంది. వెన్ను నొప్పి, ఒత్తిడి దరిచేరవు’ అని చెబుతోంది.
సారా అలీ ఖాన్
ఫిట్‌గా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయడం తప్పనిసరి అంటోంది సారా. రోజూ ఒకే స్థలంలో కాకుండా వేరు వేరు ప్రాంతాల్లో యోగా చేసేందుకు ఇష్టపడుతుందట.
దిశా పటానీ
బాలీవుడ్ బ్యూటీ జిమ్‌లో కసరత్తులతోపాటు యోగా కూడా చేస్తుంటుంది. ‘అష్టాంగ యోగా ద్వారా కండరాలు బలపడతాయి. శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. మానసిక స్థైర్యం లభిస్తుంది’ అని చెబుతోంది.
This browser does not support the video element.
శిల్పాశెట్టి
నాలుగు పదుల వయసులోనూ అదే అందం, ఫిట్‌నెస్‌ను మెయింటెన్ చేస్తుంది శిల్పాశెట్టి. అందుకు యోగా కూడా ఓ కారణమంటోంది. ‘సింపుల్ సోల్ ఫుల్’ యోగా యాప్ తనదే.
This browser does not support the video element.
మలైకా అరోరా
తన చర్మం నిగారింపు, శరీరాకృతి రహస్యం యోగానే అని అంటోంది మలైకా. తరచూ యోగా చేస్తున్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోంది.
రాశీఖన్నా
ఈ బ్యూటీ 16 ఏళ్ల వయసు నుంచే యోగా చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచీ యోగాకి మధ్యలో ఎప్పుడూ బ్రేక్ ఇవ్వలేదంట. చర్మ సౌందర్యానికి కారణం ఇదే అంటోంది రాశీ.
సమంత
ధ్యానం, యోగా తన మార్నింగ్ రొటీన్‌లో భాగమని సమంత చెబుతోంది. రోజూ వీటిని సాధన చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాదు.. జీవితంలో అనేక మార్పులు చూడొచ్చని అంటోంది.
కాజల్ అగర్వాల్
కేలొరీలు కరిగించడంలో యోగా చక్కగా ఉపయోగపడుతుందని చెబుతోంది కాజల్. వారానికి మూడు రోజులు 150 సార్లు సూర్యనమస్కారాలు చేస్తుందట.
This browser does not support the video element.
అదాశర్మ
అదాకి వాళ్ల అమ్మ చిన్నప్పుడే యోగా చేయడం నేర్పించారట. అప్పటి నుంచే దానిపై ఇష్టం పెంచేసుకుంది. సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారుందని తెలిపింది.
రకుల్ ప్రీత్ సింగ్
ఈ బ్యూటీకి యోగా చేయడమంటే చాలా ఇష్టం. రోజూ యోగాసనాలు వేస్తుంటుంది. కష్టంతో కాదు ఇష్టంతో చేస్తే దాని ఫలితాన్ని అనుభవించొచ్చు అని అంటోంది.
కియారా అడ్వాణి
‘యోగా చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా సొంతమవుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. పైగా మానసిక ప్రశాంతత చేకూరుతుంది’ అని చెబుతోంది.. కియారా.