లేడీ పర్‌ఫెక్షనిస్ట్‌లు.. సినిమా కోసం బరువు పెరిగారు!
హీరోయిన్ అంటే నాజుగ్గానే ఉండాలా ఏంటి? వైవిధ్యమైన పాత్రల కోసం బరువు పెరగడానికీ సిద్ధమే అంటున్నారు.. పలువురు హీరోయిన్లు. అనడమే కాదు, బరువు పెరిగి ఆయా పాత్రల్లో ఒదిగిపోతున్నారు. వారెవరంటే..
Image: Instagram
సోనాక్షి సిన్హా
నవంబర్ 4న విడుదలైన ‘డబుల్ ఎక్స్‌ఎల్’ చిత్రం కోసం సోనాక్షి సిన్హా దాదాపు 17 కిలోల బరువు పెరిగింది.
Image: Instagram
హ్యూమా ఖురేషీ
‘డబుల్ ఎక్స్‌ఎల్’ చిత్రంలో మరో కథానాయిక హ్యూమా ఖురేషీ. తను కూడా దాదాపు 20 కిలోలు బరువు పెరిగినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
Image: Instagram
కృతి సనన్
బాలీవుడ్ భామ కృతి సనన్ ‘మిమీ’లో సరోగసి తల్లి పాత్రలో నటించింది. ఆ పాత్ర కోసం ఆమె 15 కిలోల బరువు పెరిగింది.
Image: Instagram
కంగనా రనౌత్
తమిళనాడు మాజీ సీఎం, దివంగత నటి జయలలిత బయోపిక్ ‘తలైవి’లో కంగనా ప్రధాన పాత్ర పోషించింది. ఇందులో జయలలితగా కనిపించడం కోసం 20 కిలోల బరువు పెరిగింది.
Image: Instagram
భూమి పెడ్నేకర్
బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ తొలి సినిమా ‘ధమ్ లగా కే హైషా’. ఇందులో లావుగా ఉండే హీరోయిన్ పాత్ర కోసం భూమి.. 30 కిలోల బరువు పెరిగింది. ఆ తర్వాత 35 కిలోలు తగ్గి నాజుగ్గా తయారైంది.
Image: Instagram
విద్యాబాలన్
వైవిధ్య పాత్రలు చేయడంలో విద్యాబాలన్ ముందుంటుంది. దక్షిణాది తార సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘డర్టీ పిక్చర్’లో నటించడానికి విద్యా బాలన్ 12 కిలోల బరువు పెరిగింది.
Image: Instagram
అనుష్క
ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన ‘సైజ్ జీరో’ గుర్తుందా? అందులోని పాత్ర కోసం అనుష్క ఏకంగా 20 కిలోలు బరువు పెరిగింది.
Image: Instagram