అదా.. వెండితెరపై మళ్లీ మెరుస్తోంది!

అదా శర్మ.. ‘హార్ట్‌ ఎటాక్‌’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. గత మూడేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంది. ఇప్పుడు మళ్లీ థియేటర్లలో సందడి చేస్తోంది. 

Image: Instagram/Adah Sharma

ఇటీవల అక్షయ్‌ కుమార్‌ ‘సెల్ఫీ’లో కనిపించిన అదా.. తాజాగా ‘ది కేరళ స్టోరీ’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Image: Instagram/Adah Sharma

కేరళలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ పాన్‌ ఇండియా చిత్రం.. మే 5న విడుదల కానుంది. ఇందులో అదా.. ప్రధాన పాత్ర పోషించింది.

Image: Instagram/Adah Sharma

ముంబయిలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. 2008లో బాలీవుడ్‌ చిత్రం ‘1920’తో తెరంగేట్రం చేసింది. పలు తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటించింది.

Image: Instagram/Adah Sharma 

తెలుగులో ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’, ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’, ‘గరం’, ‘క్షణం’, ‘కల్కీ’లో నటించి ఆకట్టుకుంది.

Image: Instagram/Adah Sharma

సినిమా అవకాశాలు తగ్గడంతో ఓటీటీ బాట పట్టిన అదా.. ‘పతి పత్నీ ఔర్‌ పంగ’, ‘ఐసా వైసా ప్యార్‌’, ‘మీట్‌ క్యూట్‌’ వెబ్‌సిరీస్‌ల్లో తళుక్కుమంది. 

Image: Instagram/Adah Sharma

కొన్ని షార్ట్‌ఫిల్మ్స్‌, మ్యూజిక్‌ వీడియోల్లోనూ నటించింది. గతేడాది ‘పియా రే పియా’ అనే వీడియో సాంగ్‌ చేసింది. దానికి 46 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. 

Image: Instagram/Adah Sharma

అదా.. జిమ్నాస్టిక్‌లో శిక్షణ తీసుకుంది. మంచి డ్యాన్సర్‌ కూడా. కథక్‌ నృత్యంలో డిగ్రీ పొందింది. సాల్సా, జజ్‌, బాలెట్‌, బెల్లీ డ్యాన్సింగ్‌లోనూ అదాకు ప్రావీణ్యముంది.

Image: Instagram/Adah Sharma

సోషల్‌మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముంబయి సుందరి.. భిన్నమైన దుస్తుల్లో ఫొటోలు దిగి ఇన్‌స్టాలో పోస్టు చేస్తుంటుంది. వాటికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Image: Instagram/Adah Sharma

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home