జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌..

బయటికొస్తే ఫ్రెంచ్‌ ఫ్రైస్‌

విభిన్నమైన కథలతో కెరీర్‌లో దూసుకుపోతోంది అదా శర్మ. తాజాగా లాయర్‌ పాత్రలో ‘రీతా సన్యాల్‌’ అనే సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘ఇలాంటి రోల్‌ను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను. భయం, గడుసుతనం, ప్రేమ.. ఇలా అన్నీ భావోద్వేగాలతో ఉన్న రీతా సన్యాల్‌ పాత్ర నాకెంతో నచ్చింది’ అని చెప్పింది అదా. 

కిందటి ఏడాది ‘సెల్ఫీ’, ‘ది కేరళ స్టోరీ’తో హిట్‌ అందుకుంది. ఈ ఏడాది ‘బస్తర్‌’, ‘సి.డి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

‘కళ్ల ముందు మనకు నచ్చనిది ఏదైనా జరుగుతున్నప్పుడు క్షణాల్లో స్పందించాలి. తర్వాత బాధపడినా లాభం ఉండదు’ అని సలహా ఇస్తోంది. 

2008లో ‘1920’తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి తన సినీ కెరీర్‌ రోలర్‌ కోస్టర్‌లాగా అడ్వెంచర్లతో నడుస్తోందని అంటోంది.

నాన్చాక్‌ రిస్ట్‌ రోల్‌ చేయడం వెన్నతో పెట్టిన విద్య. ఇష్టంతో శిక్షణ తీసుకుంది. అప్పుడప్పుడు ఆ వీడియోలను షేర్‌ చేస్తుంటుంది.

ఈమెకి మూగజీవాలంటే అభిమానం ఎక్కువ. ఎన్‌జీవోలతో కలసి జంతువుల సంక్షేమానికి కృషి చేస్తుంది. 

అదా పిల్లలతో చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక షూటింగ్‌కు ఔట్‌డోర్‌కి వెళ్లినప్పుడు స్థానికులతో కలసి సందడి చేస్తూ ఉంటుంది. 

ఫిట్‌నెస్‌పై శ్రద్ధ ఎక్కువ. జిమ్‌లో కఠినమైన వ్యాయామాలు వేస్తుంది. ఏం చేసినా ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ చూస్తే తినకుండా ఉండలేనంటోంది. 

ఈమె నటించిన ‘ర్యాప్‌ చిక్‌ రీతా’ అనే వెబ్‌సిరీస్‌ షూటింగ్‌ పూర్తి అయ్యింది. బాలీవుడ్‌లో ‘ద గేమ్‌ ఆఫ్‌ గిర్జిట్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ వారం ఓటీటీ చిత్రాలివే!

వయసు పెరిగినా.. జోరు తగ్గని నాయికలు వీరే!

మిడిల్‌ క్లాస్ మిస్‌ ఇండియా.. మానస

Eenadu.net Home