బబ్లీ బెబోజాన్

సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘హీరామండి’ సిరీస్‌ గురించే సినీ అభిమానుల్లో టాక్‌ నడుస్తోంది. అందులో ప్రధాన పాత్రలు పోషించిన వారంతా స్టార్‌ నటీమణులే. వాళ్లలో ఒకరు.. అదితీ రావ్‌ హైదరి..

సిరీస్‌లో మల్లికాజాన్‌ పెద్ద కుమార్తె బెబోజాన్‌ పాత్ర పోషించింది. కళాకారిణిగా ఆకట్టుకుంటూనే దేశభక్తురాలిగా కనిపించి మెప్పించింది. సిరీస్‌ చివర్లో స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పిస్తుంది బెబో.

This browser does not support the video element.

‘హీరామండి’ కాస్ట్యూమ్‌లో ఇంతకు ముందు కనిపించిన సినిమాలన్నింటిలోకెల్లా అందంగా ఉందని, భావోద్వేగాలు బాగా పలికించిందని నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

2022లో వచ్చిన ‘హే సినామిక’ తర్వాత ఇప్పటి వరకూ వెండి తెరపై కనిపించలేదు అదితీ. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తన ప్యాన్స్‌కి ‘హీరామండి’ సిరీస్‌నే కానుకగా ఇచ్చింది.

‘ఓ పాట కోసం లెహంగా ధరించాను. ‘దీంట్లో నువ్వు బొద్దుగా కనిపిస్తున్నావు’ అన్నారు సంజయ్‌ సర్‌. పది రోజుల సమయం ఇవ్వండి తగ్గుతాను అని నేనన్నాను. దానికి ఆయన ‘లేదు ఇలాగే అందంగా ఉన్నావు. పద షూట్‌ చేద్దాం’ అన్నారు. ఆయనలో నాకు అది బాగా నచ్చింది’ అని చెప్పింది.

This browser does not support the video element.

‘సైయన్‌ హత్తో జావో..’ పాటలో తను నడిచిన గజగామిని నడక నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ‘ఆ హంస నడక గురించి సంజయ్‌ సర్‌ నాకు సలహా ఇచ్చారు. ఆయనే నా డ్యాన్స్‌ టీచర్‌. ఆయనతో కలిసి పని చేయడం నా అదృష్టం’ అని చెబుతోంది అదితీ. 

ప్రస్తుతం జరుగుతున్న కేన్స్‌ 77వ చిత్రోత్సవంలో పాల్గొంది అదితీ. ఆమె ధరించిన దుస్తులు, మేకోవర్‌ గురించే చర్చలు నడుస్తున్నాయి.

గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సిద్ధార్థ్‌, అదితీ జంట ఇటీవల నిశ్చితార్థ వేడుకను చేసుకుంది. త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు.  

This browser does not support the video element.

ఈమె నటి మాత్రమే కాదు.. మంచి సింగర్‌ కూడా..! ‘నాకు సంగీతం అంటే ఎంతో ఇష్టం. నిజం చెప్పాలంటే ప్రాణం. మ్యూజిక్‌ లేని రోజును ఊహించుకోలేను’ అని అంటోందీ బ్యూటీ.

ప్రస్తుతం ఈమె ‘గాంధీ టాక్స్‌’ అనే మూకీ చిత్రంలో, ‘లయనెస్‌’ అనే హాలీవుడ్‌ మూవీలోనూ నటిస్తోంది. కిందటి ఏడాది ‘తాజ్‌: డివైడెడ్ బై బ్లడ్’, ‘జూబ్లీ’ అనే వెబ్‌ సిరీసుల్లో నటించింది.

అదితీ ఇన్‌స్టాలో గ్లామర్‌ పోజులతో, ట్రెండీ లుక్స్‌తో యువతను కట్టిపడేస్తోంది. తన ఇన్‌స్టా ఖాతాకి 11.3 మిలియన్లకు పైగా ఫాలోవర్లున్నారు.

ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

ఈ హీరోయిన్ల ‘టాటూ’ అర్థం తెలుసా?

స్ట్రాప్‌లెస్‌ ట్రెండ్‌ గురించి విన్నారా!

Eenadu.net Home