నవరాత్రులు.. నవరంగుల్లో అదితి శంకర్‌!

దిగ్గజ దర్శకుడు శంకర్‌ కుమార్తె అదితి.. వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల కార్తి ‘విరుమన్‌’లో హీరోయిన్‌గా నటించింది.

Image: Instagram

పల్లెటూరి అమ్మాయిగా కనిపించి మెప్పించింది. ఆమె నటనకు ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలు లభించాయి.

Image: Instagram

ఈ చిత్రాన్ని తెలుగులో ‘పసలపూడి వీరబాబు’ పేరుతో ఓటీటీలో విడుదల చేశారు. దీంతో ఆమె నటన చూసి తెలుగు ప్రేక్షకులూ ఫిదా అయ్యారు.

Image: Instagram

సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే అదితి.. నవరాత్రుల సందర్భంగా.. తొమ్మిది రోజులపాటు నవ రంగుల్లో దుస్తులు ధరించి ఆకట్టుకుంది.

Image: Instagram

తొలి రోజు.. తల్లి ప్రేమను ప్రతిబింబించే తెలుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయింది.

Image: Instagram

రెండో రోజు.. ఎరుపు రంగు చీరలో మహారాణిలా కనిపించింది.

Image: Instagram

మూడో రోజు.. నీలి, గులాబీ రంగు కాంబినేషన్‌తో లంగావోణీ ధరించింది.

Image: Instagram

నాలుగో రోజు.. పసుపు రంగు లెహంగా ధరించి.. కుర్ర నెటిజన్లను కట్టిపడేసింది. 

Image: Instagram

ఐదో రోజు.. ప్రకృతిలోని పచ్చదనమంతా తనపై వాలిందా అన్నట్లుగా ఆకుపచ్చ రంగు దుస్తుల్లో మెరిసిపోయింది.

Image: Instagram

ఆరో రోజు.. బూడిద రంగు చీరలో కూల్‌గా కనిపించిందీ.. యంగ్‌ బ్యూటీ.

Image: Instagram

ఏడో రోజు.. నారింజ రంగు లెహంగాలో అదితిని చూస్తే ఫిదా అవ్వాల్సిందే.

Image: Instagram

ఎనిమిదో రోజు.. నెమలి ఆకుపచ్చ రంగు దుస్తుల్లో ఆమె హొయలు అదిరిపోయాయి.

Image: Instagram

తొమ్మిదో రోజు.. లేత గులాబీ రంగు చీరలో తన అందాలతో కుర్రకారు మనసుల్ని గిలిగింతలు పెట్టేసింది.

Image: Instagram

సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తోన్న సీనియర్‌ హీరోయిన్‌!

పచ్చందనమే.. పచ్చదనమే

‘హిట్‌’ కొట్టేసిన మీనాక్షి చౌదరి!

Eenadu.net Home