అందుకే చీర కడతా..

ఆ నలుగురు నా బెస్టీలు

మొదటి సినిమా ‘ఈశ్వర్‌’తో హిట్ అందుకున్న నటి శ్రీదేవి విజయ్‌కుమార్ తన పెళ్లి తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టింది. నారా రోహిత్ హీరోగా తెరకెక్కుతున్న ‘సుందరకాండ’లో కీలక పాత్రలో కనిపించనుంది.

మంజుల-విజయ్‌కుమార్‌ల నటవారసత్వాన్ని పుణికి పుచ్చుకుని 15ఏళ్లకే ‘ఈశ్వర్‌’తో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది.

‘నిన్నే ఇష్టపడ్డాను’,‘నిరీక్షణ’,‘పెళ్లికాని ప్రసాదు’.. ఇలా వరుస సినిమాలతో అలరించి 2009లో రాహుల్‌ని పెళ్లాడింది.  

పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చినా.. టెలివిజన్‌ షోలతో ఆడియన్స్‌ని అలరిస్తూనే ఉంది.

శ్రీదేవి శారీలవర్. ‘సంప్రదాయ దుస్తులు ధరించడం అంటే ఇష్టం. అందుకే ప్రతి ఫంక్షన్‌కి చీర తప్పక కడతా’అంటోంది. 

చిన్నచిన్నఆనందాలే రేపటి అమూల్య జ్ఞాపకాలు. అందుకే జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి - శ్రీదేవి.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీదేవి.. సరదా విషయాలను రీల్స్‌ రూపంలో పంచుకుంటూ 9.6 లక్షల ఫాలోవర్లను సంపాదించుకుంది.

ప్రతివేసవికి కుటుంబంతో కలసి యూరప్‌ వెళ్లి సంతోషంగా గడపడం అంటే ఇష్టం అని చెప్పింది.

‘షూటింగ్‌ విరామం, వీకెండ్‌ సమయాల్లో వేడివేడిగా కాఫీ ఆస్వాదిస్తా’నంటోంది.

హీరోయిన్స్‌ మీనా, సంగీత, మహేశ్వరి, స్నేహ శ్రీదేవికి క్లోజ్‌ ఫ్రెండ్స్‌. 

‘మన జీవితానికి మనమే కళాకారులం.. దాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. ఆ అవకాశాన్ని మరెవరికీ ఇవ్వకూడదు’అంటోంది.

‘మనం ఎంత ఆనందంగా ఉంటే అంత అందంగా కనిపిస్తాం’అని తన బ్యూటీ సీక్రెట్‌ చెప్పింది.

కూతురు రూపికా, భర్త రాహుల్‌.. నా సంతోషం.  నాన్న, అన్నా, అక్కలే నా బలం.. అంటోంది శ్రీదేవి.

‘మళ్లీ ఛాన్స్‌ వస్తే ప్రభాస్‌తో యాక్ట్‌ చేయాలని ఉంది’అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మనసులో మాటను పంచుకుంది. 

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home