పవర్‌స్టార్ ఫ్యాన్‌ ఇక్కడ..

డ్రీమ్‌ క్యాచర్‌’తో రీసెంట్‌గా ప్రేక్షకుల్ని పలకరించిన ఐశ్వర్య హోలక్కల్‌ త్వరలో ‘బ్రహ్మా ఆనందం’తో అలరించనుంది.

రాజా గౌతమ్‌ హీరోగా, ఆర్వీఎస్ నిఖిల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే నెల 14న విడుదల కానుంది.

కోనసీమలో పుట్టిన ఐశ్వర్య హోలక్కల్‌ హైదరాబాద్‌లో పెరిగింది. ఇక్కడే కాలేజీ విద్యను పూర్తి చేసింది.

సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌ చేసేది. ‘వాణిజ్య ప్రకటనలే సినిమా అవకాశాలు తెచ్చాయి’ అని చెప్పింది.

ఈత కొట్టడం, ట్రెక్కింగ్‌ చేయడం ఐశ్వర్య ఇష్టాలు. షూటింగ్‌ నుంచి తీరిక దొరికితే వీటితోనే సమయం గడిపేస్తుంది. 

‘హాస్టల్ డేస్’, ‘తులసీవనం’ వెబ్‌ సిరీస్‌ల్లో కామెడీ టైమింగ్‌, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

అఖిల్‌ హీరోగా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్’లో అతిథి పాత్రలో మెరిసింది. 

‘పవన్‌ కల్యాణ్‌, చికెన్‌ బిర్యానీ నా ఫేవరెట్స్‌. పాతపాటలు వింటే నన్ను నేను మరిచిపోతా’ అంది ఐశ్వర్య.

ట్రెడిషనల్‌ దుస్తులు ఇష్టపడే ఐశ్వర్య హోలక్కల్‌ వాళ్ల అమ్మ చీరలకు కొత్త మెరుగులు అద్ది ధరిస్తుంటుంది. 

నలుపు రంగు అంటే ఇష్టం. ‘బ్లాక్‌ కలర్‌ డ్రెస్‌ వేస్తే పిక్‌ దిగాల్సిందే.. ఇన్‌స్టాలో పోస్టు పెట్టాల్సిందే’ అంటోంది.

తనొక కెఫినెట్‌.. ‘ఎలాంటి మూడ్‌నైనా ఒక్క కాఫీ సెట్‌ చేసేస్తుంది’ అని చెబుతోంది.

ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యమిచ్చే ఐశ్వర్య జిమ్‌లో వర్కౌట్లకి డ్యాన్స్‌ను జోడించి కసరత్తులు చేస్తుంటుంది.

ఓల్డ్‌ + న్యూ= కొత్త రెట్రో

ముక్కు పుడక.. మస్తుంది మేడం!

బరువు సంగతి.. జిమ్‌లో చూసుకుందాంలే!

Eenadu.net Home