నేను నా హీరోలు.. సందడే సందడి

‘సంబరాల ఏటి గట్టు’ అంటూ సాయి దుర్గా తేజ్‌తో కలసి సందడి చేయనుంది ఐశ్వర్య లక్ష్మి. ఈ నేపథ్యంలో తన హీరోల గురించి ఆమె చెప్పిన ఆసక్తికర విషయాలు.

‘‘చిన్నప్పట్నుంచీ మమ్ముట్టికి అభిమానిని. ‘క్రిస్టోఫర్‌’ సమయంలో ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను’’

‘‘మట్టి కుస్తీ షూటింగ్‌ సమయంలో విష్ణు విశాల్‌తో కలిసి సెట్‌లో విపరీతంగా సందడి చేశాను. అతనో సూపర్‌ హీరో’’

‘‘కింగ్‌ ఆఫ్‌ కోతా చిత్రీకరణలో కంటే ప్రమోషన్స్‌లోనే దుల్కర్‌తో స్నేహం మరింత పెరిగింది. టీమ్‌లోని సభ్యులను ఆయన జాగ్రత్తగా చూసుకుంటారు’’

‘‘నవీన్‌ చంద్ర అల్లరి ఎక్కువగా చేస్తారు.‘అమ్ము’ సెట్‌లో సరదాగా ఉండేవారు. ఏదైనా నాటీ పని చేసేముందు డిఫరెంట్‌గా నవ్వుతారు’’

‘‘విక్రమ్‌ సినిమా అవుట్‌పుట్‌ కోసం ఆశించకుండా బెస్ట్‌ ఎఫర్ట్‌ పెడతారు. నన్ను టీజ్‌ చేస్తూ, సెట్‌లో సరదాగా ఉండేవారు’’

‘‘కార్తి పంచ్‌లు వేస్తూ నవ్విస్తూ సరదాగా ఉంటారు. తెలుగులో చక్కగా మాట్లాడతారు. అది చూసి నాకు అసూయగా అనిపిస్తుంటుంది’’

‘‘కెప్టెన్‌ మూవీ సమయంలో ఆర్య దగ్గరనుంచి ఎన్నో టిప్స్‌ నేర్చుకున్నాను. షూటింగ్‌ సమయంలో డౌట్లు అడిగేతే ఆయన విసుక్కోకుండా సమాధానం ఇచ్చేవారు’’

‘‘ఎలాంటి సమస్య వచ్చినా ధనుష్‌ నవ్వుతూనే కూల్‌గా సమాధానం ఇస్తారు. ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రశాంతంగా ఉండటం ఆయన దగ్గరే నేర్చుకున్నా’’

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home