అందాల రాశి.. ఐశ్వర్య లక్ష్మీ  

ఈ ఏడాది విడుదలైన ‘గాడ్సే’తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మీ ఇటీవల ‘పీఎస్‌ -1’తో ప్రేక్షకుల్ని మెప్పించి.. తాజాగా ‘మట్టి కుస్తీ’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Image:Instagram

విష్ణు విశాల్‌ హీరోగా, టాలీవుడ్‌ స్టార్‌ హీరో రవితేజ సహనిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది.

Image:Instagram

బాగా చదువుకొని.. కుటుంబసభ్యుల బలవంతంతో రెజ్లర్‌గా మారిన అమ్మాయిగా, హీరో భార్యగా ఐశ్వర్య నటించింది.

Image:Instagram

ఐశ్వర్య లక్ష్మీ సెప్టెంబరు 6, 1990న కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది.

Image:Instagram

ఎర్నాకుళంలోని శ్రీ నారాయణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌(SNIMS)లో ఎంబీబీఎస్‌ (MBBS) పూర్తి చేసింది. తన ఇంటర్న్‌ షిప్‌ని కూడా కంప్లీట్‌ చేసింది.

Image:Instagram

ఒకవైపు చదువును కొనసాగిస్తూనే మోడలింగ్‌ చేసింది. పలు మ్యాగజైన్‌ల కవర్‌ పేజీలపై కూడా కనిపించింది.

Image:Instagram 

నివిన్‌ పౌలి హీరోగా వచ్చిన ఫ్యామిలీ డ్రామా ‘నందుకలుడే నత్తిల్ ఒరిదవేల’తో తెరంగేట్రం చేసింది. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. Image:Instagram

ఆషిక్ అబు దర్శకత్వం వహించిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘మాయానది’లో ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాలో ఐశ్వర్య నటనకు మంచి మార్కులు పడ్డాయి.

Image:Instagram

‘వరతన్‌’లో ఫాహద్ ఫాజిల్‌ సరసన నటించింది. ఈ చిత్రంలో నటనకుగాను ఉత్తమ నటి(మలయాళ)గా సైమా అవార్డు అందుకుంది.

Image:Instagram

విశాల్‌ హీరోగా వచ్చిన ‘యాక్షన్‌’ (2019)తో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిందీ భామ.

Image:Instagram

ఐశ్వర్య నటే కాదు నిర్మాత కూడా. ఈ ఏడాది విడుదలైన సాయి పల్లవి ‘గార్గీ’లో నటించడంతోపాటు నిర్మాతగా వ్యవహరించింది.

Image:Instagram

‘నాకు రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్లంటే చాలా ఇష్టం. ప్రతినాయక ఛాయలున్న పాత్రలు చేయలేను. ఎందుకంటే నేను చాలా సరదాగా ఉంటా. నెగిటివ్‌ రోల్స్‌ చేస్తే.. ఆ ప్రభావం నాపై పడుతుందని భయం’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. Image:Instagram

ఐశ్వర్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌. ఇన్‌స్టాలో ఆమెకి 2.2 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు.

Image:Instagram

ఈ వారం ఓటీటీలో వీటిదే సందడి

చిరుతో స్టెప్పులేయడం నా అదృష్టం!

‘తెర’ పంచుకున్న హీరోయిన్లు..

Eenadu.net Home