ముగ్ధ మనోహర ‘నందిని’ ఐష్‌

వయసు పెరుగుతున్నా.. వన్నె తరగని అందం ఐశ్వర్య రాయ్‌ సొంతం. 48 ఏళ్ల ఐశ్వర్య... ఇప్పటికీ నటిస్తూ అలరిస్తోంది.

Image:Instagram 

 ‘పొన్నియిన్‌ సెల్వన్‌’తో ఈ నెల 30న సందడి చేయనుంది ఐష్. ‘ఫానీ ఖాన్’ (2018) తర్వాత ఆమె నటించిన చిత్రమిదే.

Image:Instagram

చోళ రాజ్యం నేపథ్యంలో రూపొందిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో ఐశ్వర్య రాయ్‌ నందిని అనే పాత్రలో నటించింది.

Image:Instagram

లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ బడ్జెట్‌ మూవీ తొలి పార్ట్‌ సెప్టెంబరు 30న వస్తోంది.

Image:Instagram

మిస్‌ వరల్డ్ (1994) కిరీటాన్ని దక్కించుకున్న ఈ నీలి కళ్ల సుందరి.. 1973 నవంబర్‌ 1న కర్ణాటకలోని మంగుళూరులో జన్మించింది.

Image:Instagram 

నటిగా ఐశ్వర్య ప్రయాణం మణిరత్నం దర్శకత్వంలోనే ప్రారంభమైంది. ఆయన తెరకెక్కించిన ‘ఇరువర్‌’ (తెలుగులో ‘ఇద్దరు’)తో వెండితెరకు పరిచయమైంది.

Image:Instagram

 హిందీ, తమిళ, తెలుగు, ఇంగ్లీష్‌, బెంగాలీ భాషల్లో కలిపి 45కిపైగా సినిమాల్లో నటించిదీ అందాల తార.

Image:Instagram

అభిషేక్‌ బచ్చన్‌ని 2007లో వివాహమాడిన ఐష్‌.. 2011లో ఆరాధ్యకు జన్మనిచ్చింది.

Image:Instagram

మోడలింగ్‌, నటనను కెరీర్‌గా ఎంచుకోవాలని ఐశ్వర్య మొదట్లో అనుకోలేదట. వైద్య వృత్తిలో స్థిరపడాలనుకుందట.

Image:Instagram

ఎప్పటికైనా ఒక చిత్రానికి దర్శకత్వం వహించాలనేది ఐశ్వర్య కోరికట.

Image:Instagram

క్యూట్‌ విలన్స్‌..!

‘మామా మశ్చీంద్ర’తో మృణాళిని..

1000 కోట్లు వసూలు చేసిన సినిమాలివే..!

Eenadu.net Home