చెన్నై సూపర్‌ కింగ్స్‌కు వీరాభిమాని

తెలుగు అమ్మాయే అయినా.. కోలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది.. నటి ఐశ్వర్యా రాజేశ్‌. ఇప్పుడు టాలీవుడ్‌లో వెంకటేష్‌ 58వ చిత్రంలో నటిస్తోంది. 

టైటిల్‌ ఇంకా ఖరారు కాని ఈ చిత్రానికి అనిల్‌ రావిపుడి దర్శకుడు. తాజాగా ఈ చిత్రబృందం ఐశ్వర్యకు స్వాగతం పలుకుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో ఆమె పాత్ర ‘ఎక్స్‌’లెంట్‌ వైఫ్‌ అని టీమ్‌ తెలిపింది.

మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనే ఎక్కువగా నటించే ఐశ్వర్యకు కోలీవుడ్‌లో మంచి ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఆమె సినిమాలు హిట్‌ టాక్‌ తెచ్చుకుంటాయి.

తెలుగులో రాజేంద్ర ప్రసాద్‌ ‘రాంబంటు’లో బాలనటిగా కనిపించింది. మళ్లీ ‘కౌసల్య కృష్ణమూర్తి’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. తమిళ సినిమా ‘కణ’ని తెలుగులో రీమేక్‌ చేశారు. 

ఆ తర్వాత ‘మిస్‌మ్యాచ్‌’లో నటించినా గుర్తింపు దక్కలేదు. విజయ్‌ దేవరకొండ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లో సువర్ణగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

నాని ‘టక్‌ జగదీశ్‌’, సాయి ధరమ్‌తేజ్‌ ‘రిపబ్లిక్‌’ చిత్రాల్లో నటించింది. మళ్లీ మూడేళ్ల తర్వాత వెంకీ చిత్రంతో తెలుగు తెరపై కనిపించేందుకు సిద్ధమైంది.

ప్రస్తుతం తమిళంలో ‘కరుప్పర్‌ నగరం’, ‘మోహన్‌ దాస్‌’, మలయాళంలో ‘అజయంతే రణ్‌దమ్‌ మోషణమ్‌’, ‘హర్‌’ తదితర చిత్రాల్లో నటిస్తోంది.

This browser does not support the video element.

‘ఉత్తరాఖండ’తో కన్నడ సీమలోనూ అడుగుపెట్టనుంది. సినిమాలే కాదు.. ఈమె నటించిన ‘సుడల్‌..(2022)’ వెబ్‌సిరీస్‌ కూడా సూపర్‌ హిట్‌గా నిలిచింది.

బి.కామ్‌ పూర్తి చేసిన ఈమె తమిళ్‌ కామెడీ షోలో యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టింది. ఆ తర్వాత కథానాయికగా ఎదిగింది.

ఐశ్వర్య తండ్రి రాజేశ్‌. టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించారు. హాస్య నటి శ్రీలక్ష్మి ఈమె మేనత్తే. వారి స్ఫూర్తితోనే నటిగా మారింది.

This browser does not support the video element.

నటన అంటే ఇష్టం. ఎంతలా అంటే.. ఓ సినిమా కోసం కర్రసాము కూడా నేర్చుకుంది. ‘నో పెయిన్‌ నో గెయిన్‌’ అంటుంది ఐశ్వర్య.

క్రికెట్‌కు అభిమాని.. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు వీరాభిమాని. ఐపీఎల్‌ సమయంలో స్టేడియంలో సందడి చేస్తుంటుంది. 

This browser does not support the video element.

ఫిట్‌గా ఉండటం కోసం బాగానే కష్టపడుతుంది ఐశ్వర్య. జిమ్‌లో వ్యాయామాన్ని కూడా ఫన్నీగా, ఇష్టంగా చేస్తుంటుంది.

తరచూ ఫొటో షూట్లు, రీల్స్‌ చేసి సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తోంది. తన ఇన్‌స్టా ఖాతా ఫాలోవర్ల సంఖ్య 32 లక్షల పైమాటే..

బ్యూటీల ఫిట్‌నెస్‌ మంత్ర

దక్షిణాది చిత్రసీమపై కన్నేసిన అనసూయ

గోల్డెన్‌ బ్యూటీ.. జాన్వీ

Eenadu.net Home