నాన్న తీపి జ్ఞాపకం నాపేరు
తమిళ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయినా.. అచ్చమైన తెలుగమ్మాయి ఐశ్వర్య. ఆమె తండ్రి దివంగత నటుడు రాజేశ్ తెలుగులో ఒకప్పుడు మంచి నటుడు.
చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఐశ్వర్య. వెంకటేశ్ హీరోగా తెరకెక్కుతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’తో వచ్చే పొంగల్‌కి సందడి చేయనుంది.
‘కౌసల్య కృష్ణమూర్తి’తో టాలీవుడ్‌కు పరిచయమై ‘మిస్ మ్యాచ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘టక్ జగదీష్’, ‘రిపబ్లిక్’తో గుర్తింపు తెచ్చుకుంది.
‘నాన్నతో గడిపిన సమయం చాలా తక్కువ.. ఆయన ఎప్పుడూ నాతోనే ఉండాలని ఆయన పేరును నా పేరుతో కలిపి పెట్టుకున్నా.. ఆయన తీపి జ్ఞాపకం నాపేరు’అంటోంది.
‘కప్పు కాఫీ ఎంత కోపాన్నైనా మాయం చేసేస్తుంది.. మనశ్శాంతినిస్తుంది’ అని చెబుతోంది.
‘ఎన్టీఆర్, ఏఎన్నార్ నటనంటే ఇష్టం. తీరిక సమయాల్లో వారి డ్యాన్స్‌ను రీక్రియేట్ చేస్తుంటా’అని అంటోంది.
నల్లగా ఉన్నావ్.. నువ్వు హీరోయిన్ అవుతావా? అని గేలి చేస్తున్నా పట్టు విడవక, వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రత్యే క గుర్తింపు తెచ్చుకున్నా అని ఓ సందర్భంలో పంచుకుంది.
యాక్సిడెంట్‌లో ఒకేసారి ఇద్దరు అన్నయ్యలను కోల్పోయిన ఐశ్వర్య.. చిన్నవయసులోనే కుటుంబ
పోషణకు యాంకరింగ్ స్టార్ట్ చేసింది.
ఐశ్వర్యా రాజేశ్ తండ్రే కాదు.. తాత అమర్‌నాథ్, మేనత్త శ్రీలక్ష్మి (హాస్యనటి) కూడా సినీ నటులే..
‘నలుపులోనే నిజమైన అందం దాగి ఉంది.. అందుకే నాకు బ్లాక్ కలర్ అంటే ఇష్టం’అని చెబుతోంది.
షూటింగ్ నుంచి విరామం దొరికితే ఫ్రెండ్స్‌తో విహార యాత్రలకు వెళ్లడం ఇష్టమంటూ ఇన్‌స్టాలో పోస్టులు పెడుతుంటోంది.
మేనల్లుడు ఆర్యన్ అంటే చాలా ప్రేమ. వాడు నాపై చూపించే ప్రేమను ఎవరూ బీట్ చేయలేరంటోంది ఐశ్వర్య.