అదరగొడుతున్న ఐశ్వర్య..
‘కౌసల్య కృష్ణమూర్తి’ చూశారా? అందులో తెలుగు క్రికెటర్‌గా ఆకట్టుకున్న భామే ఐశ్వర్య రాజేశ్. చిన్న సినిమాలు చేస్తూ వస్తున్న ఐశ్వర్య.. కమల్ హాసన్ - శంకర్ ‘ఇండియన్ 2’ ఛాన్స్ కొట్టేసింది.
image: instagram/aishwaryarajesh
‘రిపబ్లిక్’, ‘టక్ జగదీష్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘మిస్ మ్యాచ్’, ‘సామి స్క్వేర్’, వంటి చిత్రాలతో ఆకట్టుకుంది ఐశ్వర్య. ఇటీవల ‘ఫర్హానా’, ‘స్వప్న సుందరి’లో తన నటనతో ప్రేక్షకుల మనసు దోచేసింది.
image: instagram/aishwaryarajesh
ఐశ్వర్య రాజేశ్ మద్రాసులో 1990లో పుట్టింది. చెన్నైలోనే పైచదువులన్నీ సాగాయి. మోడల్‌గా, యాంకర్‌గా కెరియర్‌ని మొదలు పెట్టింది. ఇతర
హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటే ఐశ్వర్య హీరోయిన్‌కే ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటుంది.
image: instagram/aishwaryarajesh
‘రాంబంటు’(1996)తో బాలనటిగా వెండితెరకు పరిచయమైంది. ‘మాలద మైలిద’ అనే కన్నడ డ్యాన్స్ షోలో పాల్గొని ట్రోఫీ గెలుచుకుంది.
image: instagram/aishwaryarajesh
ఐశ్వర్య తండ్రి నటుడు కాగా, తల్లి డ్యాన్సర్. తన మేనత్త శ్రీలక్షి తెలుగు సినిమాల్లో ఫేమస్ కమెడియన్. అలా ఈ సుందరి నటీనటుల కుటుంబం నుంచే చిత్రపరిశ్రమలోకి వచ్చింది.
image: instagram/aishwaryarajesh
విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో సువర్ణ పాత్రతో ఐశ్వర్య మంచి పేరు తెచ్చుకుంది. నటనకు ప్రాధాన్యమున్న ఆ పాత్రకు చాలామంది కనెక్ట్ అయ్యారని చెప్పాలి.
image: instagram/aishwaryarajesh
కేవలం యాక్టింగ్‌లోనే కాకుండా.. పాటలు పాడటంలోనూ ఐశ్వర్య మంచి పేరు తెచ్చుకుంటోంది. తెలుగు, మరాఠీ సినిమాల్లో ఆమె పాటలు పాడింది.
image: instagram/aishwaryarajesh
కన్నన్ తెరకెక్కించిన ‘ద గ్రేట్ ఇండియన్ కిచెన్’లో ఐశ్వర్య నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. రియలిస్టిక్‌గా ఆమె నటించిందని మెచ్చుకున్నారు.
image: instagram/aishwaryarajesh
తానొక దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయినని, చాలామంది అమ్మాయిల్లా ఎన్నో కష్టాలు అనుభవిస్తే కానీ ఈ స్థాయికి రాలేదని ఐశ్వర్య చెబుతూ ఉంటుంది.
image: instagram/aishwaryarajesh