‘లైలా’ జోడీ ఆకాంక్ష

విష్వక్‌ సేన్‌ లేడీ గెటప్‌లో కనిపించనున్న ‘లైలా’తో కన్నడ భామ ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది.

ఈ చిత్రానికి రామ్‌ నారాయణ్‌ దర్శకుడు. వాలంటైన్స్‌డే కానుకగా విడుదల చేయనున్నారు. 

హరియాణాలో(1997)

పుట్టిన ఆకాంక్ష ముంబయిలో డిగ్రీ పూర్తి చేసింది. కాలేజీ రోజుల నుంచే అందాల పోటీల్లో పాల్గొనేది.

ఓ వైపు మోడలింగ్‌ చేస్తూనే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కెరీర్‌ మొదలుపెట్టింది. ‘రోడ్‌ బ్లాక్‌డ్‌ ఎ హెడ్‌’కి దర్శకత్వం వహించింది.

2022లో కన్నడ ‘త్రివిక్రమ్‌’ ద్వారా తెరపై మెరిసింది. కాలింగ్‌, ఆఫ్టర్‌ ద థర్డ్‌ బెల్‌ కన్నడ చిత్రాల్లో నటించింది.

మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ ఆకాంక్షకు మంచి క్రేజ్‌ తీసుకొచ్చాయి. ఇటీవల ‘తేరా యార్‌ హూ మే’ వీడియోతో అలరించింది.

‘డాడీ గర్ల్‌’ అని చెప్పుకొనే ఆకాంక్ష తను పరిశ్రమలోకి వెళతానంటే ఏ మాత్రం సంకోచం లేకుండా నాన్న తనను ప్రోత్సహించారని ఓ సందర్భంలో చెప్పింది.

పాటలు, డ్యాన్స్‌ అంటే ఇష్టం. ఖాళీ సమయం దొరికితే మూడ్‌ని రీఫ్రెష్‌ చేసుకోవడానికి పాటలు పాడుతూ, డ్యాన్స్‌ చేస్తుంది.

ఫిట్‌గా ఉండేందుకు కఠినమైన వ్యాయామాలు చేస్తుంది. అధిక సమయం ప్లాంక్‌లకే కేటాయిస్తుంది. ఇవే తనని ఆరోగ్యంగా ఉంచుతాయి అంటోంది.

ఆకాంక్షకు డ్రాయింగ్‌ వేయడం నచ్చుతుంది. అప్పుడప్పుడూ పెన్సిల్‌ పట్టి అందంగా బొమ్మలూ గీస్తుంది.

శివ భక్తురాలు. తరచూ ఆలయాలు వెళుతుంది. పురాతన కట్టడాలు సందర్శించడం అంటే ఆసక్తి.

ఓల్డ్‌ + న్యూ= కొత్త రెట్రో

ముక్కు పుడక.. మస్తుంది మేడం!

బరువు సంగతి.. జిమ్‌లో చూసుకుందాంలే!

Eenadu.net Home