అల్జీమర్స్‌కి చెక్‌ పెట్టేయండి..

వయసు పెరుగుతోన్న కొద్ది.. మతిమరుపు రావడం సహజమే. కానీ, కొందరికి ఇదీ తీవ్రమై అల్జీమర్స్‌కు దారి తీయొచ్చు. ఆధునిక జీవనశైలితో మధ్యవయస్కులూ దీని బారిన పడుతున్నారు. మరి అల్జీమర్స్‌ రాకుండా ఉండాలంటే..  

image: unsplash

రక్తపోటు, మధుమేహం అదుపులో లేకపోయినా అల్జీమర్స్‌ వచ్చే ప్రమాదం ఉందని అమెరికా తాజాగా చేసిన ఓ అధ్యయనంలో తేలింది. అందుకే, ముందు ఇవి రాకుండా చూసుకోవాలి. వస్తే.. నియంత్రణలో ఉంచుకోవాలి. 

image: unsplash

ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువున్నా అల్జీమర్స్‌తో పాటు ఇతర అనారోగ్యాలు వచ్చే అవకాశాలున్నాయి. శరీరానికి వీలైనంత శ్రమ కల్పించాలి. వ్యాయామం చేస్తే బరువు అదుపులో ఉంటుంది. 

image: rkc

ప్రతిరోజు వ్యాయామం చేస్తే శరీరం చురుగ్గా ఉంటుంది. మెదడు పనితీరు మెరుగవుతుంది. ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుకునేందుకు మెదడు కూడా సహకరిస్తుంది. 

image: unsplash

ధూమపానం, మద్యపానం వంటి అలవాట్ల వల్ల చిన్న వయసులోనే అల్జీమర్స్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటికి దూరంగా ఉన్నప్పుడే మతిమరుపుతో పాటు ఇతరత్రా అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. 

image: pixabay

ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు ఏదైనా సరిగా వినిపించకపోతే రెండోసారి అడిగి తెలుసుకుంటే మంచిది. మోహమాటంతో అడగకపోవడంతో విన్నది కూడా గుర్తుండదు. ఆ తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది.

image: unsplash

ముఖ్యంగా శరీరానికి నిద్ర చాలా అవసరం. సరిపడా నిద్ర పోయినప్పుడే మెదడు, శరీరం స్థిమితంగా ఉంటాయి. లేకపోతే ఒత్తిడికి గురై చిరాకులో కొన్ని విషయాలను మర్చిపోతుంటాం.

image: unsplash

విటమిన్‌ బి 12, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ డి, ఉండే ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి. వీటితో అల్జీమర్స్‌ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. 

image: unsplash

మామిడి పండు తింటే మొటిమలు వస్తాయా..!

పుచ్చకాయతో లాభాలెన్నో...

మే 17న హైపర్‌ టెన్షన్‌ డే

Eenadu.net Home