ఆలియా భట్‌ @ 10 ఇయర్స్‌

బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది.

Image:Instagram/Alia Bhutt

‘నేటికి పదేళ్లు.. ఇంకా బాగా కష్టపడుతూ.. మరింత మెరుగవుతానని మాటిస్తున్నా’ అంటూ పోస్టు చేసింది. 

Image:Instagram/Alia Bhutt

సినీ నేపథ్యంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. విభిన్నమైన పాత్రలు పోషించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Image:Instagram/Alia Bhutt

ఆలియా.. 1999లో ‘సంఘర్ష్‌’లో బాలనటిగా కనిపించింది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉండి చదువుకుంది.

Image:Instagram/Alia Bhutt

కరణ్‌ జోహర్‌ 2012లో తెరకెక్కించిన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’తో హీరోయిన్‌గా ఆలియా తిరిగి వెండితెరపై కనిపించింది.

Image:Instagram/Alia Bhutt

సినిమా సినిమాకి తన నటనను మెరుగుపర్చుకుంటూ అనతికాలంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది.

Image:Instagram/Alia Bhutt

ఇప్పటి వరకు 15కి పైగా సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించింది. పలు సినిమాల్లో అతిథి పాత్రల్లోనూ మెరిసింది.

Image:Instagram/Alia Bhutt

‘హైవే’, ‘రాజీ’, ‘గల్లీబాయ్‌’ చిత్రాల్లో తన నటనకు గానూ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు వరించాయి. అవే కాదు.. మరెన్నో అవార్డులు సొంతం చేసుకుంది ఆలియా.

Image:Instagram/Alia Bhutt

ఈ ఏడాదిలో ఆలియా నాలుగు సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘గంగూబాయి కతియావాడి’లో ఆలియా నటనకు సినీలోకం ఫిదా అయింది.

Image:Instagram/Alia Bhutt

మరోవైపు రామ్‌చరణ్‌-జూ.ఎన్టీఆర్‌తో ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ‘సీత’ పాత్రలో మెప్పించింది. ‘బ్రహ్మాస్త్ర - పార్ట్‌ 1 శివ’, ‘డార్లింగ్స్‌’ ఇటీవల విడుదలయ్యాయి.

Image:Instagram/Alia Bhutt

ఆమె నటిస్తోన్న ‘రాకీ ఔర్‌ రాణీ కి ప్రేమ్‌ కహానీ’, ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ చిత్రీకరణలో ఉన్నాయి.

Image:Instagram/Alia Bhutt

ఇటీవల ఆలియాకు ‘టైమ్స్‌ 100 ఇంపాక్ట్‌’ అవార్డు వచ్చింది. అవార్డు ప్రదాన కార్యక్రమంలో మాట్లాడుతూ.. తను ఈ స్థాయికి వచ్చేలా సహకరించిన తన కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలిపింది.

Image:Instagram/Alia Bhutt

తన ప్రియుడు, నటుడు రణ్‌బీర్ కపూర్‌ను వివాహమాడి.. ప్రస్తుతం గర్భవతిగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది ఆలియా. ఇటీవల ఆమెకు సీమంతం జరిగింది. ఆ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరలయ్యాయి.

Image:Instagram/Alia Bhutt

లవ్లీ.. లెహంగాస్‌!

జాన్వీ.. చుట్టమల్లే చుట్టేస్తాందే!

దర్శకుల గురించి తారక్‌ సూపర్‌ మాటలు!

Eenadu.net Home