కి‘రాక్‌’ వాయిస్‌.. హారికా నారాయణ్‌

This browser does not support the video element.

హారికా నారాయణ్‌.. ఇటీవల తమిళ కథానాయకుడు విజయ్‌ నటించిన వారసుడు చిత్ర ఆడియో రిలీజ్‌ వేడుకలో ఆమె పాడిన ‘తలపతి’ పాట నెట్టింట ఇప్పటికీ చక్కర్లు కొడుతోంది. 

source : harikanarayan instagram

ఆమె గొంతులో స్వరాలు పలికిన తీరును మెచ్చుకుంటూ శ్రోతలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా రవితేజ చిత్రం ‘రావణాసుర’ యాంథమ్‌ ఆలపించింది. 

source : harikanarayan instagram

గతంలో 90 సెకన్లలో తొమ్మిది మంది ఇంటర్నేషనల్‌ సింగర్స్‌ని అనుకరిస్తూ ఆమె చేసిన ఆల్బమ్‌ అందరి దృష్టినీ ఆకర్షించింది.

source : harikanarayan instagram

హారిక తూర్పుగోదావరిలోని రాజోలులో పుట్టింది. ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణకు ఈమె మనవరాలు. తండ్రి ఎయిర్‌ఫోర్సులో పని చేస్తుండటంతో హైదరాబాద్‌లో చదువుకుంది.

source : harikanarayan instagram

సంగీతం పట్ల ఆమె ఆసక్తిని గమనించి అమ్మ కేవీ నాగలక్ష్మి శిక్షణ ఇచ్చింది. ఆ తర్వాత

డీవీ మోహన కృష్ణ, కె.రామాచారి వంటి ప్రముఖుల శిక్షణలో మరింత రాటుదేలింది.

source : harikanarayan instagram

ఇంజినీరింగ్‌లో పట్టభద్రురాలైన హారిక సంగీతంపై అభిరుచితో తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో లలిత కళల్లో ఎం.ఎ చేసింది. పెయింటింగ్స్‌ వేయడం అంటే ఆసక్తి. ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే అందమైన చిత్రాలను వేస్తుంటుంది.

source : harikanarayan instagram

బీటెక్‌లో ఉండగానే హారికకు ఈటీవీలో ప్రసారమైన స్వరాభిషేకంలో కోరస్‌ సింగర్‌గా అవకాశం దక్కింది. స్టేజ్‌పై ఎస్పీ చరణ్‌తో కలిసి ‘అమ్మ బ్రహ్మ దేవుడో’ అనే పాటను మొదటిసారి ఆమె ఆలపించింది.

source : harikanarayan instagram

కొన్నాళ్లు ‘పాడుతా తీయగా’కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసింది. ‘బోల్‌ బేబీ బోల్‌’, ‘ఆలాపన’, ‘సామజ వర గమన’, ‘సింగ్‌ దిల్‌ సే’ వంటి షోల్లోనూ మెరిసింది.

source : harikanarayan instagram

హారికలోని నైపుణ్యాన్ని గుర్తించిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలు తనతోపాటు విదేశాల్లో పాడే అవకాశాన్ని కల్పించారు. ఆ సమయంలో హారికకు పరీక్షలు ఉన్నప్పటికీ తండ్రి ప్రోత్సాహంతో కచేరీలకు వెళ్లింది.

source : harikanarayan instagram

హారికకు బైక్‌ రైడింగ్ అంటే ఎంతో ఇష్టం. ఇంజినీరింగ్‌ చదువుతున్న రోజుల్లో పరీక్షలకు బైక్‌పైనే కళాశాలకు వెళ్లేదట.

source : harikanarayan instagram

హారిక ఎంత అందంగా పాడుతుందో.. అంతే అందంగా ఉంటుంది. దాంతో ఆమెకు ‘బ్రహ్మోత్సవం’, ‘ముకుంద’, ‘సైరా’ చిత్రాల్లో నటించే అవకాశం దక్కింది. 

source : harikanarayan instagram

ఈ సింగర్‌కు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అంటే మాటల్లో చెప్పలేనంత అభిమానం. మహేశ్‌ను దగ్గర నుంచి చూడొచ్చనే ‘బ్రహ్మోత్సవం’లో నటించిందని టాక్‌.

source : harikanarayan instagram

‘గని’, ‘కొండపొలం’ ‘సర్కారు వారి పాట’, ‘ఆచార్య’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘వకీల్‌సాబ్‌’, ‘బింబిసార’, ‘గాడ్‌ ఫాదర్‌’, ‘యశోద’, ‘వారసుడు’ చిత్రాలు ఆమె గాత్రానికి మంచి పేరు తీసుకొచ్చాయి.

source : harikanarayan instagram

అల్లు అర్జున్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌

ఆ సినిమాలు బోర్‌ కొట్టవు!

మలయాళీ బ్యూటీస్‌.. తెరపై క్యూట్‌నెస్‌

Eenadu.net Home