స్టైలిష్ స్టార్ స్టైలిష్ వైఫ్.. స్నేహ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ స్టైల్లో ‘తగ్గేదేలే’ అంటున్నారు. ఇటీవల ఉత్తమ నటుడిగా బన్నీ జాతీయ పురస్కారం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా స్నేహ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయ్యారు.
స్నేహా రెడ్డి హైదరాబాద్ (1985)లో పుట్టారు. చదువంతా ఇక్కడే సాగినా బీటెక్ చేసేందుకు అమెరికా వెళ్లారు. చదువు ముగిశాక తన తండ్రికి సాయంగా ఉండేందుకు ఇండియాకి తిరిగి వచ్చారు.
This browser does not support the video element.
బన్నీ, స్నేహలకు అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు. వీరిద్దరితో చేసిన ఫన్నీ వీడియోలు తన ఇన్‌స్టాలో పోస్టు చేస్తూ ఉంటారు స్నేహ.
స్నేహకి ట్రిప్పులకి వెళ్లడమంటే చాలా ఇష్టమట. ఈ మధ్యే స్నేహితులు, కుటుంబంతో వెళ్లిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముఖ్యంగా లండన్ వెళ్లడానికే ఆసక్తి చూపిస్తారట.
పిల్లలు, కుటుంబం అంటూ ఎంత బిజీగా ఉన్నా తనకంటూ కొన్ని అభిరుచులు ఉన్నాయంటున్నారు స్నేహ. షాపింగ్ చేయడం, పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం బాగా నచ్చుతాయట.
పానీపూరి విషయంలో స్నేహ సగటు అమ్మాయిలాగే ఆలోచిస్తారట. తనకి కూడా పానీపూరి అంటే చాలా ఇష్టమట. సౌత్ ఇండియన్ ఆహారంతో పాటు పిజ్జా ఓ పట్టు పట్టేస్తా అని చెబుతున్నారు.
This browser does not support the video element.
స్నేహకి మొక్కలు పెంచడం చాలా ఇష్టమట. అందుకోసం బన్నీ ప్రత్యేకంగా కొంత స్థలాన్ని స్నేహకు బహుమతిగా ఇచ్చాడట. ఆ గార్డెన్‌లో అరుదుగా దొరికే మొక్కల్ని జాగ్రత్తగా పెంచుకుంటున్నారట.
పండగ వేళల్లో ఇల్లు అలంకరించి పట్టు చీర కట్టుకొని తయారవటం స్నేహకి బాగా ఇష్టమట. అలాగే ఆ రోజు రకరకాల వంటలతో పాటు పాయసం, పులిహోరతో సగటు గృహిణిలా హడావుడి చేస్తారట.
స్నేహ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. బన్నీతో చేసిన రీల్స్, ఫొటోషూట్‌లు పోస్టు చేస్తుంటారు. ఇన్‌స్టాలో దాదాపు 8.9 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.
బిజినెస్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు స్నేహా. అప్పుడే పుట్టిన పిల్లల, మెటర్నిటీ ఫొటోషూట్లు చేసే పికాబో అనే ఫొటో స్టూడియో, అక్కడే మామ్ ఎండ్ కిడ్స్ యాక్ససరీస్‌ని కూడా అందుబాటులో ఉంచారు. దాంతోపాటు ఈవెంట్ మేనేజ్‌మెంట్ చేస్తారు.
ఫ్యాషన్ విషయంలో స్నేహ చాలా ట్రెండీగా ఉంటారు. జ్యువెలరీ నుంచి క్లాత్స్ వరకూ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటారు.
This browser does not support the video element.
స్నేహ ఫిట్‌నెస్ విషయంలో ఏ మాత్రం తగ్గలేదు. కారణం రోజూ యోగాతో పాటు జిమ్, వర్కౌట్లు చేస్తారట. అలాగే కఠినమైన డైట్ రూల్స్ పాటిస్తుంటారట.
(source: instagram)