అమెరికాలో హెలెన్‌ విధ్వంసం

అమెరికాలో హరికేన్‌ హెలెన్‌ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటివరకూ దాదాపు 95 మంది మృతి చెందినట్లు అంచనా వేస్తున్నారు.

గురువారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు అమెరికాలోని ఫ్లోరిడా, జార్జియా, నార్త్‌ కరోలినా, సౌత్‌ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో కేటగిరి- 4 ‘హెలెన్‌’ తీవ్ర ప్రభావం చూపింది.

తుపాను తీరం దాటేటప్పుడు గంటకు 225 కి.మీ వేగంతో వీచిన గాలుల కారణంగా జార్జియా, సౌత్‌ కరోలినా, నార్త్‌ కరోలినా, టెనస్సీలో వేలాది చెట్లు కూలిపోయాయి. కొన్ని ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి

అట్లాంటాలో 48 గంటల్లో 28.24 సెం.మీ.ల వర్షపాతం నమోదయ్యింది. 1886లో నమోదైన 24.36 సెం.మీ. వర్షపాతాన్ని ఇది అధిగమించింది. 

జార్జియాలోని వివిధ ఆసుపత్రుల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 30 లక్షల మంది తుపాను కారణంగా వణికిపోతున్నారు.

రహదారులు, బ్రిడ్జ్‌లు కూలిపోయాయి. రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతో చాలా మంది వరదల్లో చిక్కుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. వందలాది వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి.

యూఎస్‌లోని 19 రాష్ట్రాలపై తుపాను ప్రభావం తీవ్రంగా పడిందని అంచనా. నిత్యావసరాల దుకాణాలు, మొబైల్‌ సర్వీసులు పని చేయడం లేదు.

తుపాను కారణంగా ధ్వంసమైన ప్రాంతాలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పరిశీలించనున్నారు.

స్ఫూర్తి నింపే విషయాలివీ

స్ఫూర్తినింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home