అబ్బబ్బ తీరిపోయే.. ఇన్నాళ్లు కన్న కల...
‘హను-మాన్’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న అమృత అయ్యర్ ప్రస్తుతం ‘బచ్చల మల్లి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల అయ్యింది.
2012లో ‘పద్మవ్యూహం’తో పరిశ్రమలోకి అడుగుపెట్టినా.. తమిళంలో ‘బిగిల్’తో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ‘రెడ్’తో ఎంట్రీ ఇచ్చింది.
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’, ‘అర్జున ఫాల్గుణ’తో అలరించింది. తమిళంలో 15కు పైగా చిత్రాల్లో నటించింది.
‘హను-మాన్’లో ‘పూలమ్మే పిల్లా...’ పాట తనకెంతో స్పెషల్. ఆ సాంగ్ బాగా నచ్చిందని చెబుతోంది అమృత.
‘ఒక్కోసారి కలలు కూడా నిజమవుతాయి. అది నాకు ‘హనుమాన్’తో అర్థమయ్యింది. ఇలాంటి సినిమా కోసమే కలలు కన్నాను’ అని చెప్పింది.
ఖాళీ దొరికితే వివిధ ప్రాంతాలను చుట్టేస్తూ ఉంటుంది. ఈ మధ్య తన ఇన్‌స్టాలో ఆ ఫొటోలే ఉన్నాయి.
‘నేల మీద స్వర్గం ఏదైనా ఉందా అంటే అవి ఐలాండ్స్.. ప్రపంచాన్ని మర్చిపోయి ఐలాండ్స్‌లో గడపడం నచ్చుతుంది’ అని చెప్పింది.
రెహమాన్ సంగీతంతో పాటు ఓ కప్పు కాఫీ ఉంటే చాలబ్బా... జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది అంటోంది అమృత..