అందం, అభినయం.. అమృత

అమృత అయ్యర్‌ ఈపేరు వినే ఉంటారు..కదా..! అదేనండి ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా..?’ (2021) అనే సినిమా కథానాయిక. ఈమె మరో బహుభాషా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

image: instagram/ amritha aiyer

ప్రస్తుతం తేజ సజ్జ సరసన ‘హనుమాన్‌’లో నటిస్తోంది. ప్రశాంత్‌ వర్మ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం విడుదల కానుంది. 

image: instagram/ amritha aiyer

 అమృత కన్నడలో ‘పడై వీరన్‌’ (2018) చిత్రంతో అరంగేట్రం చేసింది. తెలుగులో 30 రోజుల్లో ప్రేమించటం ఎలా..? (2021) చిత్రంతో అడుగు పెట్టింది ఈ భామ. 

image: instagram/ amritha aiyer

 అమృత 1994లో బెంగళూరులో పుట్టింది. చదువు మొత్తం అక్కడే సాగింది. సినిమాల్లోకి రాక ముందే మోడలింగ్‌లో పలు యాడ్స్‌ చేసింది.

image: instagram/ amritha aiyer

తొలి చిత్రం తర్వాత..‘రెడ్‌’, ‘అర్జున ఫాల్గుణ’.. వంటి చిత్రాల్లో నటించింది. ‘లిఫ్ట్‌’,‘పడైవీరన్‌’, ‘హైవే కాదలి’, ‘కాఫీ విత్‌ కాదల్‌’,‘బిజిల్‌’ లాంటి పలు తమిళ, కన్నడ చిత్రాలతో ఆకట్టుకుంది. 

image: instagram/ amritha aiyer

ఈ తార తమిళ్‌లో వచ్చిన బిగిల్‌(తెలుగులో విజిల్‌) చిత్రంతోనే బాగా ఫేమస్‌ అయ్యింది. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉంది. కన్నడలో ‘గ్రామాయణ’, తెలుగులో ‘హనుమాన్‌’ చిత్రీకరణలో ఉన్నాయి. 

image: instagram/ amritha aiyer

ఈ కన్నడ అందానికి సంప్రదాయంగా దుస్తులు ధరించటం, గుడికి వెళ్లడం అంటే చాలా ఇష్టమట. అంతేకాకుండా సోషల్‌మీడియాలో కూడా సంప్రదాయంగా ఉన్న ఫొటోలనే ఎక్కువగా పంచుకుంటోంది. 

image: instagram/ amritha aiyer

కథానాయిక పాత్రలే చేయాలని ఉంటుంది. కానీ కథలో అత్యంత ప్రాధాన్యమున్న పాత్ర అయితే దాన్ని చేయటానికి వెనకాడను. అవి ప్రేక్షకులకు నచ్చేవి, మెచ్చేవి అయితే చాలంటుంది. 

image: instagram/ amritha aiyer

అమృతకి ఖాళీ దొరికితే వంట చేయటం, పుస్తకాలు చదవటం, డ్యాన్స్‌ చేయడమంటే బాగా నచ్చుతుందట. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు వంట నేర్చుకున్నానని చెబుతోంది.

image: instagram/ amritha aiyer

పనిలో ఎంత బిజీగా ఉన్నా సోషల్‌మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు దాదాపుగా పది లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. 

image: instagram/ amritha aiyer

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home