రన్నర్ బయోపిక్‌లో మరాఠా బ్యూటీ!
భారత అథ్లెట్ లలిత శివాజీ బాబర్ జీవితం ఆధారంగా మరాఠీలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అందులో మరాఠా బ్యూటీ అమృత ఖాన్విల్కర్ ప్రధాన పాత్ర పోషిస్తోంది.
Image: Instagram/Amruta Khanvilkar
లాంగ్ డిస్టెన్స్ రన్నర్‌గా రాణిస్తూ.. 2014 ఏషియన్ గేమ్స్‌లో రజతం, 2015 ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన లలిత బాబర్ పాత్రలో తాను నటించడం గొప్ప బాధ్యతగా భావిస్తున్నట్లు అమృత సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది.
Image: Instagram/Amruta Khanvilkar
ఇంతకీ ఈ అమృత ఎవరంటే.. ముంబయిలో పుట్టి పుణెలో పెరిగిన సినీ నటి. అటు బాలీవుడ్, ఇటు మరాఠీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది.
Image: Instagram/Amruta Khanvilkar
చిన్నవయసులోనే పలు టీవీషోల్లో కంటెస్టెంట్‌గా, వ్యాఖ్యాతగా, జడ్జ్‌గా వ్యవహరించిన అమృత.. 2006లో మరాఠీ ‘గోల్‌మాల్’తో వెండితెరకు పరిచయమైంది.
Image: Instagram/Amruta Khanvilkar
ఆ మరుసటి ఏడాది ‘ముంబయి సాల్సా’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆర్జీవీ ‘ఫూంక్’తో బీటౌన్‌లో పాపులారిటీ సంపాదించింది.
Image: Instagram/Amruta Khanvilkar
‘రంగూన్’, ‘రాజీ’, ‘సత్యమేవ జయతే’, ‘మలంగ్’ తదితర బాలీవుడ్ చిత్రాల్లో నటించింది.
Image: Instagram/Amruta Khanvilkar
అమృత.. ఎప్పుడూ తన మాతృభాషకే ప్రాధాన్యం ఇస్తుంటుంది. అందుకే, హిందీ కన్నా మరాఠీ చిత్రాల్లోనే ఎక్కువగా నటిస్తోంది.
Image: Instagram/Amruta Khanvilkar
గతంలో పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ మెరిసిన అమృత.. ‘డ్యామేజ్డ్’ అనే హిందీ వెబ్ సిరీస్‌లోనూ నటించి మెప్పించింది.
Image: Instagram/Amruta Khanvilkar
బాలీవుడ్ నటుడు హిమాంశు మల్హోత్రతో అమృత వివాహం జరిగింది. హిమాంశు కూడా సినిమాల్లోకి రాకముందు పలు టీవీషోల్లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు.
Image: Instagram/Amruta Khanvilkar
ఇద్దరూ ఒకే షోలో పాల్గొనడంతో వీరి పరిచయం ప్రేమగా మారింది. పదేళ్లు డేటింగ్ చేసి.. ఆ తర్వాత 2015లో పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది వీరిద్దరూ కలిసి ‘నాచ్ బాలియో’ సీజన్ 7 విజేతగా నిలిచారు.
Image: Instagram/Amruta Khanvilkar
సినిమా వేడుకల్లో అమృత తన అవుట్‌ఫిట్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. సోషల్‌మీడియాలోనూ చురుగ్గా ఉండే ఈమెకు 3.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
Image: Instagram/Amruta Khanvilkar