చీరల్లో ఉండే గ్రేసే వేరబ్బా: అనన్య నాగళ్ల
‘పొట్టేల్’ ప్రమోషన్స్‌తో నెట్టింట వైరల్ అవుతోంది అనన్య నాగళ్ల. అక్టోబరు 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బుజ్జమ్మ పాత్రలో అనన్య అలరించనుంది.
‘పొట్టేల్’ చూసే వారికి నేను బుజ్జమ్మగానే గుర్తుండిపోతాను అంటూ తన పాత్ర మీద ఉన్న నమ్మకాన్ని చెబుతోంది.
‘పొట్టేల్’ ఎఫెక్టో ఏమో.. ఇటీవల సోషల్ మీడియాలో అనన్య ఫాలోయిగ్ పెరిగింది. ఇన్‌స్టాలో ఫ్యాన్ ఫాలోయింగ్ 15లక్షలు దాటిపోయింది.
ఈ ఏడాది ఇప్పటికే ‘తంత్ర’, ‘డార్లింగ్’చిత్రాలతో అలరించిన అనన్య.. ‘బహిష్కరణ’ వెబ్‌సిరీస్‌లోనూ నటించి మెప్పించింది.
తెలంగాణ సత్తుపల్లిలో పుట్టిన అనన్య.. ఇంజినీరింగ్ పూర్తి చేసింది. నటన మీద ఆసక్తితో మోడలింగ్ చేసి.. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది.
‘మల్లేశం’ ద్వారా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చి.. ‘వకీల్ సాబ్’, ‘మాస్ట్రో’, ‘శాకుంతలం’, ‘మళ్ళీ పెళ్ళి’, ‘అన్వేషి’ చిత్రాలతో అలరించింది.
ఫిట్‌నెస్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కఠినమైన ఆసనాలు వేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
చీరల్లో ఉండే గ్రేసే వేరబ్బా.. చీర కట్టుకోగానే ఎక్కడ లేని ఆత్మవిశ్వాసం వచ్చేస్తుంది అని తనకు, చీరకు ఉన్న బంధం గురించి చెబుతుంటుంది అనన్య.