‘లైగర్‌’ జోడీ.. బాలీవుడ్‌ బ్యూటీ!

బాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌ అనన్య పాండే ‘లైగర్‌’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది.

Image:Instagram/Ananya Panday

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో అనన్యనే హీరోయిన్‌.

Image:Instagram/Ananya Panday

సినిమా ప్రమోషన్స్‌లో చిత్రబృందంతోపాటు దేశవ్యాప్తంగా పర్యటించింది. దీంతో ఈ భామకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగిపోయింది.

Image:Instagram/Ananya Panday

అర్జున్‌రెడ్డి సినిమా చూసి విజయ్‌ దేవరకొండ నటనకు అనన్య ఫిదా అయిపోయిందట. తనతో సినిమా చేసే అవకాశం రావడం, అదీ పాన్‌ ఇండియా చిత్రం కావడం నిజంగా తన అదృష్టమంటూ సంతోషం వ్యక్తం చేసింది.

Image:Instagram/Ananya Panday

అనన్య తండ్రి చుంకీ పాండే బాలీవుడ్‌లో ప్రముఖ నటుడు. దీంతో తను కూడా నటిగా రాణించాలని చిన్నప్పుడే నిర్ణయించుకుంది.

Image:Instagram/Ananya Panday

2019లో కరణ్‌ జోహర్‌ నిర్మించిన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2’ చిత్రంతో అనన్య బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది.

Image:Instagram/Ananya Panday 

తొలి చిత్రంతోనే ఫిల్మ్‌ఫేర్‌, ఐఫా సహా పలు అవార్డులు సొంతం చేసుకుంది. కెరీర్‌ ప్రారంభంలోనే స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది.

Image:Instagram/Ananya Panday

ఆ తర్వాత ‘పతి, పత్ని ఔర్‌ వో’, 2020లో ‘ఖాళీ పీలీ’చిత్రాలతో మెప్పించింది. ‘గెహ్రాహియా’లో దీపికా పదుకొణెతో వెండితెరను పంచుకుంది.

Image:Instagram/Ananya Panday

ఒకానొక సమయంలో అవకాశాలు రాకపోవడంతో పైచదువుల కోసం అమెరికా వెళ్లిపోవాలని అనుకుందట.

Image:Instagram/Ananya Panday

అదే సమయంలో అనన్యకు ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2’ అవకాశం రావడంతో సినిమానే తన కెరీర్‌గా మారింది.

Image:Instagram/Ananya Panday

అనన్యకు చిన్నప్పట్నుంచి హృతిక్‌ రోషన్‌ అంటే చాలా ఇష్టమట. అయితే, సినిమాల్లో మాత్రం వరుణ్‌ ధావన్‌తో నటించడానికి ఇష్టపడతానని చెబుతోంది.

Image:Instagram/Ananya Panday

తనకు ‘కుచ్‌కుచ్‌ హోతాహై’లాంటి చిత్రం చేయాలని ఉందంటూ తన కోరికను వెల్లడించింది.

Image:Instagram/Ananya Panday 

షారుఖ్‌ ఖాన్‌ ప్రేమకథా చిత్రాలంటే అనన్యకు చెప్పలేనంత ఇష్టమట. ఆ చిత్రాల్లో హీరోకి ఉండే లక్షణాలున్న అబ్బాయే తనకు భర్తగా రావాలని తన మనసులో మాట బయటపెట్టింది.

Image:Instagram/Ananya Panday


తరచూ ఫొటోషూట్స్‌లో పాల్గొనే అనన్య తన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేస్తూ ఉంటుంది. ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అవుతుంటారు. ఇన్‌స్టాలో ఆమెకు 23.4మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు.

Image:Instagram/Ananya Panday

ఓటీటీలో అలరించడానికి సిద్ధమైన సినిమాలు/సిరీస్‌లు

స్కూల్‌లో ప్రపోజ్‌ చేసి.. గుడిలో పెళ్లి చేసుకుని..

ఓనం సొగసుల్‌.. అదిరెన్‌..

Eenadu.net Home