ఐస్‌క్రీమ్‌.. మ్యూజిక్‌.. ఆల్‌టైమ్‌ ఫేవరెట్స్‌

‘ఖో గయే హమ్‌ కహా’తో అలరించిన అనన్యపాండే ‘చాంద్‌ మేరా దిల్‌’అంటూ ప్రేమ కథతో సందడి చేయబోతుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు.

బాలీవుడ్‌ నటుడు చుంకీ పాండే కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్య తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తుంది.

‘లైగర్‌’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనన్య.. ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్రాలతో బిజీగా ఉంది. 

‘కాల్‌ మీ బె’ వెబ్‌సిరీస్, ‘కంట్రోల్‌’ మూవీతో ఇటీవల ఓటీటీ ప్రేక్షకులను పలకరించింది. 

పాఠశాల విద్యను ధీరూబాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లోనూ, ఉన్నత విద్యను పారిస్‌లో పూర్తిచేసింది అనన్య. 

‘అతిథి పాత్రలు చేయడమంటే ఇష్టం. ప్రత్యేక పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం ఆసక్తి’ అని ఓ సందర్భంలో చెప్పింది. 

సినిమాల్లో ఆరేళ్లు పూర్తిచేసుకున్న అనన్యకు హారర్‌-కామెడీ జానర్‌లో నటించాలని ఉందంటూ ఓ సందర్భంలో చెప్పింది.

‘ఐస్‌క్రీమ్‌ + అర్జిత్‌ సింగ్‌ సాంగ్స్‌, ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’ మూవీ ఆల్‌టైమ్‌ ఫేవరెట్స్‌’ అంటోంది.

సుహానా ఖాన్‌, జాన్వీ కపూర్‌, సారా అలీఖాన్‌, అనన్యకు బెస్టీలు.. ఈ నలుగురు కలిస్తే సందడే సందడి.

ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యతనిచ్చే అనన్య.. పిజ్జా, చాక్లెట్స్‌ చూస్తే తినకుండా ఉండలేదు.

అనన్య జంతు ప్రేమికురాలు.. పెంపుడు శునకాలతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తుంటుంది.

ట్రెండీగా ఉండే అనన్య తన తల్లి భావనపాండే దుస్తులకు కొత్త మెరుగులు అద్ది ధరిస్తుంటుంది.

‘ఇంపోస్టర్‌ సిండ్రోమ్‌ కారణంగా.. నా నటన పట్ల నేను సంతృప్తి చెందను’అని చెప్పింది.

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home