దక్షిణాది చిత్రసీమపై కన్నేసిన అనసూయ
తెలుగులో తన టాలెంట్‌ని నిరూపించుకున్న అనసూయ దక్షిణ సినీ పరిశ్రమలోనూ రాణించేందుకు ప్రయత్నిస్తోంది.
ఇప్పటికే ‘భీష్మపర్వం’తో మలయాళంలో మెరిసిన ‘జబర్దస్త్’ యాంకర్.. రెండు తమిళ సినిమాలు ‘ఫ్లాష్‌బ్యాక్’, ‘ఉల్ఫ్’లో నటిస్తూ బిజీగా ఉంది.
అల్లు అర్జున్ ‘పుష్ప 1’లో దాక్షాయనిగా మెప్పించింది.. రెండో పార్ట్‌లోనూ ఈమె పాత్ర కీలకమని చిత్రబృందం చెబుతోంది.
ఇటీవల తెలంగాణ ప్రాంతీయ నేపథ్యంలో విడుదలైన ‘రజాకార్’లో పోచమ్మ పాత్రలో అలరించింది.
ఇక తెలుగునాట అనసూయ అభిమానుల గురించి చెప్పనక్కర్లేదు.. ‘రంగస్థలం’ నుంచి రంగమ్మత్తగా బాగా ఫేమసయ్యింది.
‘రంగమ్మత్త’గా ఈమె నటనకుగానూ ఫిల్మ్‌ఫేర్, సైమా సహా పలు అవార్డులు లభించాయి.
ఫొటో షూట్లతో నెట్టింట సందడి చేసే అనసూయకు ఇన్‌స్టాలో 15 లక్షలకు పైగా ఫాలోవర్లున్నారు. ఈ మధ్య ఎక్కువగా చీరల్లోనే హొయలొలికిస్తోంది.
ప్రస్తుతం యాంకరింగ్ వదిలిపెట్టి సినిమాల్లో నటిస్తున్నా.. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో టీవీ షోల్లోనూ కనిపిస్తోంది.
ఈమె డ్రెస్సింగ్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపికే. నెగెటివ్ కామెంట్లు చేసిన వారికి రంగమ్మత్త గట్టిగానే సమాధానం చెబుతోంది.
This browser does not support the video element.
నోరు కట్టుకోకుండా నచ్చిన ఆహారం తీసుకుంటూ.. ఫిట్‌గా ఉండేందుకు జిమ్ చేస్తుంటుంది.