‘హరిహర వీరమల్లు’లో అనసూయ
ఇటీవల ‘పుష్ప 2’లో నటించిన అనసూయ ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.
క్రిష్- జ్యోతికృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మార్చి 28న విడుదల కానుంది. ఇందులో నాయిక నిధి అగర్వాల్. అనసూయ ఓ పాటలో కనిపించనుంది.
‘హరిహర వీరమల్లు’ నుంచి తాజాగా విడుదలైన ‘కొల్లగొట్టినాదిరో’ సాంగ్ ప్రోమోలో అనసూయ ట్రెడిషనల్ లుక్‌లో కనిపించింది.
తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న అనసూయ కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది.
తమిళంలో ‘ఫ్లాష్ బ్యాక్’లో నటిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబరులో విడుదల కానుంది. మరో సినిమా ‘వోల్ఫ్’ నవంబర్‌లో రానుంది.
ప్రాంతీయ నేపథ్యంలో ఇటీవల వచ్చిన ‘రజాకార్’లో అనసూయ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
‘మనిషికి మార్పు అనేది అవసరం.. అది లైఫ్ స్టైల్ అయినా, చేసే పని అయినా.. ఎప్పుడూ ఒకేలా చేస్తే జీవితం బోర్ కొట్టేస్తుంది’ అని చెబుతోంది.
అనసూయకు ఐస్‌క్రీమ్ అంటే ఇష్టం. బయటకు వెళ్తే ఐస్‌క్రీమ్ తినకుండా ఇంటికి రాదు.
సమయం దొరికితే ఇంట్లో వాళ్లతో షటిల్ ఆడుతుంది. ఫిట్‌గా ఉండేందుకు ఇదే సహాయపడుతుంది అని చెప్పింది.
పండగలు, ప్రత్యేక సందర్భాల్లో అమ్మతో నచ్చిన వంటకాలన్నీ చేయించుకొని ఫుల్‌గా లాగించేస్తుంది. ఉండ్రాళ్ల పాయసం ఫేవరెట్.
స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లు చూడడం నచ్చుతుంది. ఐపీఎల్‌లో ‘SRH’కి సపోర్ట్ చేస్తూ స్టేడియంలో సందడి చేస్తుంది.
‘ఫ్యామిలీతో ఉంటే అసలు సమయమే తెలియదు.. పిల్లలతో ఉంటే కష్టాలన్నీ మర్చిపోతాను. వాళ్లే నా స్ట్రెస్ బస్టర్లు’ అని చెప్పింది.