రంగమ్మత్త.. మస్త్ బిజీ!
‘జబర్దస్త్’షో యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న అనసూయ.. వెండితెరపై కూడా మెప్పిస్తోంది.
Image: Instagram/Anasuya Bharadwaj
‘రంగస్థలం’లో ‘రంగమ్మత్త’ పాత్ర చేసిన తర్వాత అనసూయకు సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.
Image: Instagram/Anasuya Bharadwaj
సినిమాలతో బిజీ అవుతుండటంతో ఈ మధ్య యాంకరింగ్‌ను పక్కన పెట్టేసింది.
Image: Instagram/Anasuya Bharadwaj
ఇటీవల అనసూయ నటించిన ‘మైఖేల్’, ‘రంగమార్తాండ’ సినిమాలు విడుదలయ్యాయి. వీటికి మిశ్రమ స్పందన లభించింది.
Image: Instagram/Anasuya Bharadwaj
ఇంకా అనసూయ చేతిలో పలు ప్రాజెక్టులున్నాయి. ఆయా సినిమాలకు సంబంధించిన ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్ విడుదలవుతున్నాయి.
Image: Instagram/Anasuya Bharadwaj
సంతోష్ కాటా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమ విమానం’లో ముఖ్య పాత్ర పోషించింది అనసూయ. తాజాగా ఈమె ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
Image: Instagram/Anasuya Bharadwaj
సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, అనసూయ ప్రధాన పాత్రల్లో ‘అరి’ తెరకెక్కుతోంది. ఇటీవల ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది.
Image: Instagram/Anasuya Bharadwaj
నటుడిగా ప్రభుదేవా 60వ చిత్రం ‘వుల్ఫ్’. వినూ వెంకటేశ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ హర్రర్ యాక్షన్ సినిమాలో అనసూయ నటిస్తోంది.
Image: Instagram/Anasuya Bharadwaj
అల్లు అర్జున్ ‘పుష్ప 2’లో అనసూయ ‘దాక్షాయణి’ పాత్ర కొనసాగనుంది. మరో తమిళ చిత్రం ‘ఫ్లాష్‌బ్యాక్’లోనూ నటిస్తూ బిజీగా ఉంది.
Image: Instagram/Anasuya Bharadwaj
ప్రధాన పాత్రల్లోనే కాదు గతంలో కొన్ని సినిమాల్లోని ప్రత్యేక గీతాల్లోనూ అనసూయ ఆడిపాడింది.
Image: Instagram/Anasuya Bharadwaj
‘విన్నర్’లో సూయ సూయ అనసూయ, ‘ఎఫ్ 2’లో డింగ్ డాంగ్, ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’లో వా వా మేరే బావ, ‘చావు కబురు చల్లగా’లో పైన పటారం పాటల్లో తళుక్కున మెరిసింది.
Image: Instagram/Anasuya Bharadwaj