బుల్లితెర రాములమ్మ.. నటనలోనూ చక్కనమ్మా..!
శ్రీ ముఖి.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తనదైన చలాకీ మాటలతో, పంచ్‌లతో ఆకట్టుకుంటూ తెలుగులో ప్రముఖ వ్యాఖ్యాతల్లో ఒకరిగా మారింది.
Image:Instagram
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీ ముఖి ఈ మధ్య హాట్ లుక్స్‌తో నెటిజన్ల హృదయాలను దోచేస్తోంది.
Image:Instagram
ఈ బ్యూటీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్న ఫొటోలను చూసి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు.
Image:Instagram
‘పటాస్ ఫుల్ టూ బిందాస్’ అంటూ ప్రేక్షకులకు దగ్గరైన ఆమె అభిమానులతో చిన్న ‘రాములమ్మ’ అని పిలిపించుకుంది.
Image:Instagram
బిగ్‌బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా పాల్గొని
రన్నరప్‌గా నిలిచింది. ఈ రియాలిటీ షోకి వెళ్లిన తర్వాత శ్రీ ముఖి క్రేజ్ మరింత పెరిగింది.
Image:Instagram
కాస్త బొద్దుగా ఉండే ఈ క్రేజీ భామ బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా అలరిస్తోంది.
Image:Instagram
‘జులాయి’లో అల్లు అర్జున్, ‘నేను..శైలజ..’లో రామ్ పోతినేని సోదరి పాత్రలో నటించింది.
Image:Instagram
‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించింది.
Image:Instagram
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో శ్రీవిష్ణు గర్ల్ ఫ్రెండ్ సోనియాగా నటించింది. తమిళ, కన్నడ సినిమాల్లోనూ మెరిసింది. Image:Instagram
ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘జెంటిల్‌మెన్’లో కీలక పాత్రలో కనిపించింది. ‘క్రేజీ అంకుల్స్’ అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది.
Image:Instagram
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భోళా శంకర్’. ఇందులో ఓ పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
Image:Instagram
శ్రీ ముఖి యూ ట్యూబ్ ఛానల్‌కు 7 లక్షల 48వేల సబ్‌స్క్రైబర్స్ ఉండగా.. ఇన్‌స్టాలో 4.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
Image:Instagram