ఏంజెలియా క్యాట్‌ వాక్‌.. నెట్టింట వైరల్‌ టాక్‌!

ఇటీవల జరిగిన మిస్‌ ఇండియా పోటీల్లో తన క్యాట్‌వాక్‌తో వైరల్‌ అయ్యింది మిస్‌ మేఘాలయ.. తనే ఏంజెలియా మార్వైన్‌.

‘సూపర్‌ మోడల్స్‌ గిగి హాడిడ్‌, కైలీ జెన్నర్‌ లాంటి వాళ్లు ఈమె బ్రేక్‌ఫాస్ట్‌కే సరిపోరు’ అంటూ క్యాప్షన్‌ జోడించిన ఏంజెలియా క్యాట్‌ వాక్‌ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

సూపర్‌ ఎనర్జీ, గ్రేస్‌, చిరునవ్వుతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఏంజెలియా. వెలుగులోకి వచ్చిన ఈమె క్యాట్‌వాక్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

24 ఏళ్ల ఏంజెలియా షిల్లాంగ్‌లో పొలిటికల్‌ సైన్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. మోడలింగ్‌ చేస్తూనే మాస్టర్స్‌ని కొనసాగిస్తోంది.

‘రూరల్‌ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. విద్య, ఆహారం, దుస్తులు అందరికీ అందుబాటులో ఉండాలి’ అంటూ ఎన్జీవోలతో కలిసి తనూ కృషి చేస్తోంది.

మోడలింగ్‌పై చిన్నప్పట్నుంచే ఎంతో ఆసక్తి. ‘మిస్ ఇండియా 2024’ పోటీలకు మేఘాలయ తరఫున ప్రాతినిధ్యం వహించింది.

‘వేదిక మీద నన్ను నేను చూసుకున్నప్పుడల్లా.. ఈ సారి నా ప్రదర్శన గతం కంటే భిన్నంగా ఉండాలి అని ప్రణాళిక వేసుకుంటాను. అదే ‘మిస్‌ మేఘాలయ’ వరకూ తీసుకొచ్చింది’ అని అంటోందీమె.

ప్రకృతికి ఫిదా అయిపోతానంటోంది ఏంజెలియా.. ట్రిప్‌ అంటే కొండలు, అడవుల్లోకే వెళుతుందట.

ఒక్కసారి బీచ్‌ చూద్దామని వెళితే దాన్ని వదిలి ఇంటికి వెళ్లడం చాలా కష్టంగా అనిపించిందని చెబుతోందీమె. 

హార్స్‌ రైడింగ్‌, గిటార్‌ ప్లే చేయడం, పుస్తకాలు చదవడం ఏంజెలియా హాబీలు. నలుపు రంగు అంటే ఇష్టం.  

ఒత్తిడిని దూరం చేసే ఆయిల్‌ మసాజ్‌

కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈ లక్షణాలు ఉండాలి!

ఆకర్షణీయమైన నగరాల్లో టాప్-10 ఇవే!

Eenadu.net Home