యాంగర్ టేల్‌తో వస్తోన్న బిగ్‌బాస్(ఓటీటీ)విజేత
పుష్కరకాలం కిందట ‘అవకాయ బిర్యానీ’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి బిందు మాధవి.
Image: Instagram/Bindu Madhavi
ఈ మధ్య బిగ్‌బాస్ తెలుగు(ఓటీటీ) సీజన్ విజేతగాను నిలిచిన ఈ సుందరి.. మార్చి 9న విడుదల కానున్న ‘యాంగర్ టేల్స్’ వెబ్‌సిరీస్‌లో కనిపించనుంది.
Image: Instagram/Bindu Madhavi
బిందు మాధవి.. అచ్చ తెలుగు హీరోయిన్. 1986 జూన్ 14న ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో జన్మించింది. తన కుటుంబం చెన్నైలో స్థిరపడింది.
Image: Instagram/Bindu Madhavi
బయోటెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసిన బిందు.. చదువుకుంటున్న సమయంలోనే మోడలింగ్ చేసేది. పలు ప్రచార చిత్రాల్లోనూ నటించింది.
Image: Instagram/Bindu Madhavi
బిందు ప్రచారచిత్రాలు చూసిన దర్శకుడు శేఖర్ కమ్ముల ‘అవకాయ్ బిర్యానీ’లో హీరోయిన్‌గా అవకాశమిచ్చారు.
Image: Instagram/Bindu Madhavi
తొలి చిత్రంతోనే ఆకట్టుకున్న బిందు.. ‘బంపర్ ఆఫర్’, ‘ఓం శాంతి’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’ ‘పిల్ల జమిందార్’ తదితర చిత్రాల్లో నటించింది.
Image: Instagram/Bindu Madhavi
ఆ తర్వాత తమిళ చిత్రాల్లో నటిస్తూ.. కోలీవుడ్‌కే పరిమితమైంది. బిగ్‌బాస్ తమిళ్ సీజన్-1లో కంటెస్టెంట్‌గా పాల్గొంది.
Image: Instagram/Bindu Madhavi
చాలా కాలం తర్వాత 2020లో ‘ఆహా’ఓటీటీలో విడుదలైన మస్తీస్‌తో మరోసారి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమాల్లో నటించాలనే ‘బిగ్‌బాస్ ఓటీటీ’లో పాల్గొన్నానని చెప్పింది.
Image: Instagram/Bindu Madhavi
బిగ్‌బాస్ ఓటీటీ విజేతగా నిలిచిన బిందు మాధవికి దర్శకుడు అనిల్ రావిపూడి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. బాలకృష్ణతో తీస్తున్న చిత్రంలో బిందుకు అవకాశమిస్తానని చెప్పాడు.
Image: Instagram/Bindu Madhavi
సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే బిందు.. తరచూ మోడ్రన్ దుస్తుల్లో కనిపించి ఆకట్టుకుంటోంది.
Image: Instagram/Bindu Madhavi
గతంలో తన డ్రెస్సింగ్‌పై కొందరు ట్రోల్స్ చేయగా.. వాటికి బిందు ఘాటుగానే సమాధానమిచ్చింది. వేసుకున్న దుస్తులను బట్టి ఇచ్చే గౌరవం తనకు వద్దని స్పష్టం చేసింది.
Image: Instagram/Bindu Madhavi
ప్రస్తుతం బిందు.. ‘యారుకుమ్ అంజియల్’, ‘మాయన్’, ‘పగైవనుకు అరుల్వై’ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగు సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.
Image: Instagram/Bindu Madhavi