ఏదైనా చేయాలనుకుంటే చేసేయాలి.. లేకపోతే...
‘గీతాంజలి మళ్లీ వచ్చింది’తో హాఫ్‌సెంచరీ కొట్టింది కథానాయిక అంజలి. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో త్వరలో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
విశ్వక్‌సేన్ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో నేహా శెట్టి మరో నాయిక. ఈ సినిమా మే 31న విడుదలవుతోంది.
‘ఇప్పటివరకూ నటించిన చిత్రాలన్నీ ఓ లెక్క ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఓ లెక్క’ అంటోంది అంజలి. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిలా మొరటుగా కనిపిస్తుంది.
రామ్‌చరణ్ - శంకర్ ‘గేమ్ ఛేంజర్’లోనూ అంజలి ఓ కథానాయికగా నటిస్తోంది. సీనియర్ చరణ్ సరసన ఆమె కనిపించనుంది.
‘గేమ్ ఛేంజర్’లో పాత్ర భలే ఉంటుంది అని చెబుతున్నా.. అసలు విషయాలు చెప్పడం లేదు. వివరాలు బయటికి చెప్పొద్దు అని చిత్రబృందం ఆమెకు షరతు పెట్టిందట.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో వరుస చిత్రాలతోపాటు.. వెబ్ సిరీసుల్లోనూ నటిస్తోంది.
తమిళంలో ‘పావ కదైగల్’ సిరీస్‌లో డ్యుయెల్ రోల్‌లో కనిపించింది. ‘నవరస’, ‘ఫాల్’, ‘ఝాన్సీ’తో అలరించింది. ‘బహిష్కరణ’ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది.
చీరకట్టుని ఎక్కువగా ఇష్టపడుతుంది. సోషల్ మీడియాలోనూ ఆ ఫొటోలనే ఎక్కువగా షేర్ చేస్తుంది.
పెంపుడు జంతువులంటే ఇష్టం. ఖాళీ సమయం దొరికితే తన పెంపుడు శునకంతో ఆడుకుంటుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుందంటోంది.
This browser does not support the video element.
‘వీకెండ్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుంటాను. నచ్చిన ఫుడ్ లాగించేస్తూ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తా’ అని చెబుతోందీ బ్యూటీ.
షూటింగ్ నుంచి విరామం దొరికితే విహారయాత్రలు ప్లాన్ చేస్తుంది. ఆ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
‘జీవితంలో ఏమేం చేయాలనుకుంటామో.. అవి మనం బాగున్నప్పుడే చేసేయాలి. తర్వాత బాధపడుతూ కూర్చుంటే ఏం రాదు’ అని వేదాంతం చెబుతుంటుంది.