అంకిత.. తెలుగుతెరపై కొత్తందం! 

‘రాజు యాదవ్‌’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది.. అంకిత ఖరత్‌. ఇందులో గెటప్‌ శ్రీను హీరో. 

కృష్ణమాచారి దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంతోనే అంకిత టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.

ఈమె పుట్టింది ముంబయిలో. మాస్‌ మీడియాలో డిగ్రీ పూర్తి చేసింది. మోడల్‌గా కెరీర్‌ మొదలుపెట్టింది. 

పలు అందాల పోటీల్లో టైటిల్‌ను గెలుచుకుంది. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది.

This browser does not support the video element.

ఇంట్లో వాళ్లంతా గాయకులే.. అలా ఈమె కూడా పాటలు పాడటం నేర్చుకుంది. అటు మోడల్‌గానూ, ఇటు సింగర్‌గానూ జీవితాన్ని బ్యాలెన్స్‌ చేస్తోంది.

పాటలు పాడటమే కాకుండా సొంతంగా కంపోజ్‌ కూడా చేస్తుంది. కొరియన్‌, స్పానిష్‌, మరాఠి, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు.

ఈమె డ్రాయింగ్‌ కూడా చేస్తుంది. ఖాళీ సమయాల్లో బొమ్మలు వేయడం, రంగోలీ వేయడం ఇష్టమంటోంది. 

ఫిట్‌గా ఉండటం అంకితకి ఎంతో ఇష్టం. ఇష్టమైన ఆహారమంతా లాగించేసినా జిమ్‌లో గంటల కొద్దీ శ్రమిస్తుంటుంది.

‘స్విమ్మింగ్‌ కూడా నా ఫిట్‌నెస్‌ స్రీకెటే. స్విమ్‌ చేయాలనిపిస్తే టైం చూసుకోను. అర్ధరాత్రి అయినా సరే పూల్‌లో దిగుతాను’ అని చెబుతోందీ అంకిత.

This browser does not support the video element.

గ్లామర్‌ ఫొటోలతో ఇన్‌స్టాను హీటెక్కిస్తుంటుందీ బ్యూటీ. స్విమ్మింగ్‌ చేస్తూ, జిమ్‌ చేస్తున్న వీడియోలు తెగ వైరల్‌ అవుతుంటాయి.

ఏడేళ్ల ప్రేమ.. ఏకమైన వేళ

సాక్షి వైద్య గురించి ఆసక్తికర విషయాలు..

కల్కి పోస్టర్లు చూశారా?

Eenadu.net Home