అదిరెను చూడు.. ఆంధ్రా అందం..

‘ఉండిపోరాదే’తో 2019లో వెండితెరకు పరిచయమైంది.. లావణ్య సాహుకారా. ఇప్పుడు ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’తో జులై 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

image: instagram/ i_lavnnya

చందు ముద్దు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘30 వెడ్స్‌ 21’ వెబ్‌సిరీస్‌ ఫేమ్‌ చైతన్య రావు హీరోగా నటించాడు. ఇందులో లావణ్య పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. 

image: instagram/ i_lavnnya

ఈ తెలుగుంటి అందం.. 1999లో విశాఖపట్నంలో పుట్టింది. చదువు కొవ్వాడలో సాగింది. చిన్నప్పట్నుంచే తనకి నటనపై ఆసక్తి. దాంతో కాలేజీ రోజుల్లోనే యాక్టింగ్‌ వైపు అడుగులేసింది.

image: instagram/ i_lavnnya

చదువుకునే రోజుల్లో ఫ్యాన్సీ డ్రెస్‌, డ్యాన్స్‌ కాంపిటేషన్లలో యాక్టివ్‌గా పొల్గొనేది. తర్వాత మోడలింగ్‌ కూడా చేసింది. 

image: instagram/ i_lavnnya

‘ఉండిపోరాదే’ చిత్రంతో 2019లో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత పెద్దగా అవకాశాలేవీ రాలేదు. ‘అసిస్టెంట్‌ డైరెక్టర్‌’, ‘ఇష్టమే కానీ ప్రేమ కాదంట’ తదితర వీడియో పాటలు, యూట్యూబ్‌ వెబ్‌సిరీస్‌లోనూ నటించింది. 

image: instagram/i_lavnnya

‘ట్రూ’ చిత్రం 2021లో వచ్చింది. అది అంతగా గుర్తింపు ఇవ్వకపోయినా ‘అన్నపూర్ణ స్టూడియో..’తో హిట్‌ అందుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం ఈ ఆంధ్ర బ్యూటీ ‘వాలెంటైన్స్‌ నైట్’లో నటిస్తూ బిజీగా ఉంది.  

image: instagram/ i_lavnnya

ఈ తెలుగమ్మాయికి చీర కట్టుకోవడమంటే.. చాలా ఇష్టం. చీరలో దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో పోస్టు చేసి యువతను కట్టిపడేస్తుంది. 

image: instagram/ i_lavnnya

ఫిట్‌గా ఉండేందుకు ప్రతి రోజూ జిమ్‌, యోగా, డ్యాన్స్‌ చేస్తుందట. అలాగే ఖాళీ సమయం దొరికితే స్నేహితులతో సరదాగా గడుపుతూ, రీల్స్‌ చేస్తూంటుంది ఈ సుందరి. 

image: instagram/ i_lavnnya

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home