‘పరదా’ చాటున అనుపమ..

‘టిల్లు స్క్వేర్‌’తో ‘లిల్లీ’గా కుర్రకారులో క్రేజ్‌ సంపాదించుకున్న అనుపమ.. త్వరలో ‘పరదా’తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంగీత, దర్శన కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

మలయాళంలో ‘జెఎస్‌కె ట్రూత్‌ షల్‌ ఆల్వేజ్‌ ప్రివైల్‌’, ‘పెట్‌ డిటిక్టివ్‌’, తమిళ్‌లో.. ‘బైసన్‌’, ‘లాక్‌డౌన్‌’, ‘డ్రాగన్‌’ వంటి చిత్రాలతో బిజీబిజీగా ఉంది.

ఓ వైపు చిత్రాలతో బిజీగా ఉన్నా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫొటోలను ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకుంటుంది.

ప్రముఖ మ్యాగజైన్‌ కవర్‌ ఫొటోలకు పోజులిస్తుందీ రింగుల జుట్టు సుందరి. ‘ఏ డ్రెస్‌ అయినా, పోజు ఏదైనా సెల్ఫీ ముఖ్యం’ అంటోంది.

1996 కేరళలో పుట్టింది. కమ్యూనికేటివ్‌ ఇంగ్లిష్‌, జర్నలిజంలో డిగ్రీని మధ్యలో ఆపేసింది. ఇప్పుడు మళ్లీ కంటిన్యూ చేస్తోంది.

2015లో ‘ప్రేమమ్‌’తో మలయాళ తెరమీద అడుగుపెట్టిన అనుపమ 10 ఏళ్లుగా.. తెలుగు, తమిళ, మలయాళనాట సక్సెస్‌ఫుల్‌ జర్నీని సాగిస్తోంది. 

పండుగలు వస్తే చాలు పట్టు చీరలు, పరికిణీలే గుర్తొస్తాయి. ట్రెడిషనల్‌ లుక్స్‌లో సోషల్‌ మీడియాలో సందడి చేస్తుంది.

‘బర్త్‌డే అయితే బీచ్‌లోనైనా చేసుకోవాలి. లేదా రోజంతా ఇంట్లో అమ్మతో అయినా గడపాలి’ అనేది ఆమె రూలు.

‘నేనొక ఫుడీనీ.. ఇంట్లో ఉంటే డైట్‌ పక్కన పెట్టేసి.. అమ్మ చేసిన అన్నం, పప్పుని, నెయ్యి వేసుకొని ఫుల్‌గా లాగించేస్తా’ అని అంటోంది.

ప్రకృతి అంటే ఇష్టం. ఊరికి వెళ్లినప్పుడల్లా.. తోటలు, పొలాలు, పశువుల పాకల్లోనే ఎక్కువ సమయం గడిపేస్తుంది.  

ఖాళీ సమయం దొరికితే ఫ్రెండ్స్‌తో సరదాగా బయటకు వెళ్లి ఐస్‌క్రీమ్‌ తింటూ ఎంజాయ్‌ చేస్తుంది.   

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

19 ఏళ్లకే మిస్‌ ఇండియా.. ఇప్పుడు మిస్‌ వరల్డ్‌ బరిలో..

దృశ్యం.. ఆరు రీమేక్‌లు.. అరుదైన రికార్డులు..

Eenadu.net Home